అన్వేషించండి

Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!

New Bajaj Pulsar N250 SS: కొత్త బజాజ్ పల్సర్ N250 SSలో 4-వాల్వ్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్‌షిఫ్టర్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఐదు రైడింగ్ మోడ్స్ వివరాలు.

Bajaj Pulsar N250 SS Review: క్వార్టర్ లీటర్ బైక్ సెగ్మెంట్‌లో బజాజ్ పల్సర్ N250కు ప్రత్యేక స్థానం ఉంది. అందుబాటులో ఉండే ధర, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, పల్సర్‌కు మాత్రమే ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్‌కు బలాలు. ఇప్పుడు కొత్త N250 SSతో బజాజ్ మరిన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇంజిన్‌ను అప్‌డేట్ చేయడంతో పాటు 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్‌షిఫ్టర్, ఆధునిక డిస్‌ప్లే, కొత్త రైడింగ్ మోడ్స్‌ను జోడించింది. ఎక్స్‌పర్ట్‌లు ఈ కొత్త బైక్‌పై కొన్ని గంటల పాటు రైడ్ చేసి రివ్యూ ఇచ్చారు. వాళ్ల అనుభవం ప్రకారం, పల్సర్‌ N250 SSలో వచ్చిన మార్పులు ఈ మోటార్‌సైకిల్‌ను మరింత పూర్తిస్థాయి ప్యాకేజీగా మార్చాయి. అయితే, పాత మోడల్‌లోని రోజువారీ ప్రయాణ సౌకర్యం మాత్రం అలాగే కొనసాగింది. 

ఫస్ట్‌ రైడ్‌ అనుభవం ప్రకారం, కొత్త పల్సర్ N250 SSలో ఎక్స్‌పర్ట్‌లను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఐదు అంశాలు:

 1. డిజైన్‌లో పెద్ద మార్పులు లేవు.. కొత్త రంగులతో ఫ్రెష్ లుక్

కొత్త N250 SSలో పాత మోడల్‌కు పరిచయమైన డిజైన్‌ను కొనసాగించారు. కండలు తిరిగినట్లుగా కనిపించే ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్‌ పదునైన ఎక్స్‌టెన్షన్లు, చిన్న టెయిల్ సెక్షన్ వంటివి ఈ బైక్‌కు స్ట్రీట్ నేకెడ్ లుక్‌ ఇస్తాయి. కొత్త గ్రాఫిక్స్, అట్లాంటిక్ బ్లూ, ఫైరీ రెడ్ ఆరెంజ్ రంగులు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.

ఫీచర్ల విషయంలో మాత్రం గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. ఇందులో 5 అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు గూగుల్ మ్యాప్స్‌ను డిస్‌ప్లేపై చూపించే సదుపాయం ఉంది. దీంతో ప్రయాణ సమయంలో నావిగేషన్ చూసుకోవడం సులభమవుతుంది. అయితే కొత్త ఇంటర్‌ఫేస్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పట్టవచ్చు.

కొత్త స్విచ్‌గేర్ నాణ్యత, ఉపయోగించే సమయంలో లభించే స్పందన బాగున్నాయి. హజార్డ్ స్విచ్, పాత USB-A స్థానంలో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చాయి. హార్డ్ బ్రేకింగ్ సమయంలో, వెనుక బ్రేక్ లైట్ వేగంగా వెలుగుతూ వెనుక వచ్చే వాహనాలను అప్రమత్తం చేసే పానిక్ బ్రేక్ అలర్ట్ మరో ముఖ్యమైన ఫీచర్.

 2. కొత్త ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మెరుగైన పనితీరు

ఈ బైక్‌లో ప్రధానమైన మార్పు ఇంజిన్‌లో కనిపిస్తుంది. 249.07 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,750 ఆర్‌పీఎం వద్ద 24.7 బీహెచ్‌పీ శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 22 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత రెండు వాల్వుల ఇంజిన్‌తో పోలిస్తే పవర్, టార్క్ రెండూ స్వల్పంగా పెరిగాయి.

మరో ముఖ్యమైన అప్‌డేట్ 6-స్పీడ్ గేర్‌బాక్స్. గతంలో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండేది. అదనంగా వచ్చిన ఆరో గేర్ హైవే ప్రయాణాల్లో ఉపయోగపడుతుంది. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ ఆర్‌పీఎం తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. ఫలితంగా వైబ్రేషన్లు తగ్గే అవకాశం ఉండటంతో పాటు సుదీర్ఘ ప్రయాణాల్లో ఇంధన సామర్థ్యానికీ మద్దతు ఇవ్వవచ్చు.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ఇంజిన్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. ఆర్‌పీఎం పెరిగే కొద్దీ పవర్ క్రమంగా అందుతుంది. ప్రారంభ వేగంలోనూ మంచి స్పందన కనిపిస్తుంది. పల్సర్‌కు ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్‌ను కొనసాగిస్తూనే, కొత్త మోడల్‌లో కొంత డీప్‌ సౌండ్‌ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి: లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ బైక్.. 150-160cc సెగ్మెంట్‌లో ఈ మూడు బైకుల మధ్య టఫ్‌ ఫైట్‌!

 3. ఐదు రైడింగ్ మోడ్స్‌తో మరింత నియంత్రణ

కొత్త N250 SSలో ఎలక్ట్రానిక్ థ్రోటిల్ బాడీని జోడించారు. దీని సహాయంతో ఐదు రైడింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు. అవి.. రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్, టూర్. రోడ్డు పరిస్థితులు, రైడింగ్ అవసరాలకు అనుగుణంగా థ్రోటిల్ రెస్పాన్స్‌ను మార్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఈ మోడ్స్ ఇప్పటికే ఉన్న ABS మోడ్స్‌తో కలిసి పనిచేస్తాయి. టెస్ట్ రైడ్‌లో ఎక్కువ సమయం స్పోర్ట్ మోడ్‌లోనే ప్రయాణించగా, ఇంజిన్ నుంచి మరింత చురుకైన స్పందన లభించింది. వేగంగా ప్రయాణించాలనుకునేవారికి ఈ మోడ్ నచ్చవచ్చు. వర్షం లేదా ఇతర రోడ్డు పరిస్థితుల్లో అవసరానికి తగిన మోడ్‌ను ఎంచుకోవడం అదనపు సౌలభ్యం.

 4. క్విక్‌షిఫ్టర్, అడ్జస్టబుల్ లివర్స్‌తో రైడింగ్ సౌకర్యం

కొత్త పల్సర్‌లో బై-డైరెక్షనల్‌ క్విక్‌షిఫ్టర్‌ను అందించారు. దీనిని బజాజ్ పవర్ షిఫ్టర్ అని పిలుస్తోంది. క్లచ్ ఉపయోగించకుండా గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఉత్సాహంగా బైక్ నడిపేటప్పుడు గేర్‌ను వేగంగా, సులభంగా మార్చడానికి ఇది సాయపడుతుంది.

బ్రేక్, క్లచ్ లివర్స్‌ను కూడా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది. రైడర్ చేతులకు అనుగుణంగా లివర్ దూరాన్ని మార్చుకోవచ్చు. గోల్డ్ ఫినిష్‌తో ఉన్న యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ పాత మోడల్‌లో ఉన్నట్లుగానే కొనసాగాయి. రోడ్డు ఎగుడుదిగుళ్లపై సస్పెన్షన్ మంచి నియంత్రణను అందిస్తుంది. కార్నరింగ్ సమయంలోనూ బైక్‌పై నమ్మకం కలిగిస్తుంది.

మరో ముఖ్యమైన మార్పు వెనుక టైర్‌లో ఉంది. పాత బయాస్-ప్లై టైర్ స్థానంలో రేడియల్ టైర్‌ను ఇచ్చారు. దీని వల్ల గ్రిప్ మెరుగుపడటంతో పాటు మలుపుల్లో బైక్‌ను వంచేటప్పుడు మరింత నమ్మకం లభిస్తుంది. బ్రేకింగ్ పనితీరు మాత్రం పాత మోడల్ తరహాలోనే కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి: 3 సెకన్లలో 100km స్పీడ్‌, 670km రేంజ్‌, 1156hp పవర్‌.. లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో మరో సంచలనం!

 5. నగర ప్రయాణాలకు సులభం.. మలుపుల రోడ్లపై మరింత నమ్మకం

కొత్త N250 SSలో రైడింగ్ పొజిషన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. హ్యాండిల్‌బార్, ఫుట్‌పెగ్స్ సహజమైన స్థానాల్లో ఉంటాయి. కొంత స్పోర్టీ ఫీలింగ్ ఉన్నప్పటికీ రైడర్ చేతులపై అధిక ఒత్తిడి పడదు. సీటు ఎత్తు, గ్రౌండ్ క్లియరెన్స్, ఇతర ముఖ్యమైన కొలతలు కూడా పాత మోడల్ తరహాలోనే ఉన్నాయి.

నగర ట్రాఫిక్‌లో బైక్‌ను సులభంగా నడపవచ్చు. నిటారుగా కూర్చునే పొజిషన్ రోజువారీ ప్రయాణాలకు సౌకర్యంగా ఉంటుంది. మలుపులు ఎక్కువగా ఉండే రోడ్లపై కొత్త రేడియల్ వెనుక టైర్ మెరుగైన గ్రిప్‌ను అందిస్తుంది. సస్పెన్షన్ కూడా సౌకర్యం, హ్యాండ్లింగ్ మధ్య మంచి సమతుల్యతను కొనసాగిస్తుంది.

కొత్త ఫీచర్లు, ఇంజిన్ మార్పులు వచ్చినప్పటికీ బైక్ బరువు కేవలం కిలో మాత్రమే పెరిగింది. ఇప్పుడు దీని కర్బ్ వెయిట్ 165 కిలోలు. రైడింగ్ సమయంలో ఈ అదనపు బరువు గుర్తుకురాదు.

 ధర, పోటీ బైక్‌లు.. కొనడం విలువైనదేనా?

కొత్త బజాజ్ పల్సర్ N250 SS ఎక్స్-షోరూమ్ ధర రూ.1,59,406. పాత N250తో పోలిస్తే సుమారు రూ.14,000 ధర పెరిగింది. అయితే కొత్త ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్‌షిఫ్టర్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, రేడియల్ టైర్ వంటి అప్‌డేట్స్‌ను పరిశీలిస్తే ఈ ధర పెంపునకు న్యాయం జరిగిందనే చెప్పవచ్చు.

ఈ ధర వద్ద Suzuki Gixxer 250, Hero Xtreme 250R వంటి క్వార్టర్ లీటర్ బైక్స్‌తో ఇది పోటీపడుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Affordable Gloves Boots: రూ.15 వేలల్లోనే పూర్తి రైడింగ్ గేర్.. CE Level 2 ఆర్మర్ అంటే ఏమిటి?
రూ.15 వేలల్లోనే బైక్ పూర్తి రైడింగ్ గేర్.. జాకెట్, గ్లౌజులు, బూట్లను ఎలా ఎంచుకోవాలి?
2026 KTM 200 Duke Review: కేవలం రూ.1,500 అదనపు ధర.. కేటీఎం 200 డ్యూక్‌లో 5 కీలక అప్‌డేట్స్ ఇవే!
2026 కేటీఎం 200 డ్యూక్ రివ్యూ: ఈ బైక్‌లో వచ్చిన 5 కొత్త అప్‌డేట్స్, ప్రత్యేకతలు ఇవిగో!
Bike Pillion Seat: తల్లిదండ్రులతో బైక్‌పై ప్రయాణిస్తున్నారా? వెనుక కూర్చునేవారికి సౌకర్యవంతమైన సీట్‌ ఉన్న 5 బైక్స్
తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించడానికి సౌకర్యవంతమైన వెనుక సీట్లు.. భారత్‌లో టాప్ 5 బైక్స్ ఇవే!
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Embed widget