అన్వేషించండి

TVS vs Bajaj vs Hero: లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ బైక్.. 150-160cc సెగ్మెంట్‌లో ఈ మూడు బైకుల మధ్య టఫ్‌ ఫైట్‌!

Sporty Bike: టీవీఎస్ అపాచీ RTR 160, బజాజ్ పల్సర్ 150, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R బైకుల ధరలు, ఇంజిన్, ఫీచర్లు, పనితీరులో ఏది బెస్టో తెలుసుకోండి.

Sporty Bike Under Rs 1 Lakh: రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడటంతో పాటు అప్పుడప్పుడు స్పోర్టీ రైడింగ్‌ను ఆస్వాదించాలనుకునే వారికి 150-160cc బైకులు మంచి ఆప్షన్‌. ముఖ్యంగా 100-125cc కమ్యూటర్ బైక్ నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునేవాళ్లు ఈ విభాగంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో TVS Apache RTR 160, Bajaj Pulsar 150, Hero Xtreme 160R మధ్య గట్టి పోటీ ఉంది. వీటిలో ఒకటి స్పోర్టీ పనితీరుకు ప్రాధాన్యత ఇస్తే.. మరొకటి ఆధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇంకొకటి తక్కువ బరువు, సులభమైన హ్యాండ్లింగ్‌తో ఆకర్షిస్తోంది. మరి, మీకు ఏ బైక్ సరిపోతుంది?

డిజైన్, ఫీచర్లలో ఏది ముందుంది?

టీవీఎస్ అపాచీ RTR 160 స్పోర్టీ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. కండలు తిరిగినట్లుగా కనిపించే ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్‌ బాడీ డిజైన్, LED హెడ్‌ల్యాంప్ దీని ప్రత్యేకతలు. వేరియంట్‌ను బట్టి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ట్రాక్షన్ కంట్రోల్, హజార్డ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. టాప్ వేరియంట్లలో డ్యూయల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంటుంది.

బజాజ్ పల్సర్ 150 కూడా ప్రత్యేకమైన మస్కులర్ డిజైన్‌ను కొనసాగిస్తూనే కొత్త తరం ఫీచర్లను అందిస్తోంది. ఇందులో 5 ఇంచుల TFT డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. రోడ్, రెయిన్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. క్రాల్ టెక్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు కూడా వేరియంట్‌ను బట్టి లభిస్తాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160R మాత్రం కాంపాక్ట్ స్ట్రీట్‌ఫైటర్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో ఇన్వర్టెడ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, USB ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ ల్యాంప్స్ ఉన్నాయి. వెడల్పైన వెనుక టైర్ బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది.

ఇంజిన్, పనితీరులో దేనిది పైచేయి?

టీవీఎస్ అపాచీ RTR 160లో 159.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. స్పోర్ట్ మోడ్‌లో ఈ ఇంజిన్ 8,750 RPM వద్ద 15.8 HP పవర్, 7,000 RPM వద్ద 13.85 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్, రెయిన్ మోడ్‌లలో పవర్ అవుట్‌పుట్ తగ్గుతుంది. అధిక వేగంతో ప్రయాణించాలనుకునే వారికి ఈ బైక్ మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!

బజాజ్ పల్సర్ 150లో 149.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 RPM వద్ద 13.8 HP పవర్, 6,500 RPM వద్ద 13.25 NM టార్క్‌ను అందిస్తుంది. కొత్త గేర్‌బాక్స్‌తో పాటు ఇంజిన్ పనితీరులోనూ మార్పులు చేశారు. తక్కువ వేగంలో మెరుగైన స్పందన, వేగవంతమైన పికప్ అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160Rలో 163.2cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ 8,500 RPM వద్ద సుమారు 14.8 HP పవర్, 6,500 RPM వద్ద 14 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అపాచీతో పోలిస్తే పవర్ తక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ బరువు కారణంగా నగర ప్రయాణాల్లో చురుగ్గా స్పందిస్తుంది.

రైడింగ్, హ్యాండ్లింగ్ ఎలా ఉన్నాయి?

అపాచీ RTR 160ని స్పోర్టీ రైడింగ్‌ను ఇష్టపడేవారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్ ఛార్జ్డ్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి దీని బరువు సుమారు 137 కిలోల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు బైకుల్లో ఇదే తక్కువ బరువున్న మోడల్.

కొత్త పల్సర్ 150లో డైమండ్ టైప్ ఫ్రేమ్, నైట్రోజన్ గ్యాస్ ఛార్జ్డ్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం, మలుపుల్లో మంచి నియంత్రణ అందించడమే వీటి లక్ష్యం. ఇందులో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఈ మూడు బైకుల్లో ఇదే ఎక్కువ సామర్థ్యం కలిగిన ట్యాంక్.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160R బరువు సుమారు 139.5 కిలోలు. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ఏడు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే రియర్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. తక్కువ బరువు, కాంపాక్ట్ డిజైన్ కారణంగా నగర ట్రాఫిక్‌లో నడపడం సులభంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: 278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి

ధరలు ఎంత?

టీవీఎస్ అపాచీ RTR 160 ప్రారంభ ధర రూ.1,13,890గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.1,27,990 వరకు ఉంటుంది.

బజాజ్ పల్సర్ 150 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.1,16,295 కాగా, టాప్ వేరియంట్ ధర రూ.1,24,449గా ఉంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160R సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,13,829 నుంచి ప్రారంభమవుతుంది. డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,20,346గా ఉంది.

ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. నగరం, వేరియంట్‌, టాక్స్‌లను బట్టి ఆన్‌రోడ్‌ ధరల్లో మార్పులు ఉంటాయి.

మీకు ఏ బైక్ సరిపోతుంది?

మంచి పవర్, స్పోర్టీ రైడింగ్ అనుభూతి కావాలనుకునేవారికి టీవీఎస్ అపాచీ RTR 160 సరైన ఎంపిక. ఈ మూడు బైకుల్లో అత్యధిక పవర్ అందించడంతో పాటు మెరుగైన స్పోర్టీ రైడింగ్ సెటప్‌ను కలిగి ఉంది.

ఆధునిక ఫీచర్లు, కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చేవారు బజాజ్ పల్సర్ 150ను పరిశీలించవచ్చు. TFT డిస్‌ప్లే, నావిగేషన్, మూడు రైడింగ్ మోడ్‌లు వంటి ఫీచర్లు దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రోజువారీ ప్రయాణాలకు అనువైన బైక్‌తో పాటు ఆధునిక సదుపాయాలు కోరుకునేవారికి ఇది నచ్చవచ్చు.

తక్కువ బరువు, సులభమైన హ్యాండ్లింగ్, స్పోర్టీ లుక్ కావాలనుకునేవారికి హీరో ఎక్స్‌ట్రీమ్ 160R మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించాలనుకునేవారు దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

కొనుగోలు చేసే ముందు టెస్ట్ రైడ్ చేసి, మీ ప్రాంతంలోని తాజా ధరలను తెలుసుకోవడం మర్చిపోవద్దు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Regenerative Braking In EVs: ఫుల్ ఛార్జింగ్‌తో కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నారా? ఎలక్ట్రిక్‌ కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం!
ఎలక్ట్రిక్‌ కారును 100 శాతం ఛార్జ్ చేస్తే రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎందుకు ఆగిపోతుంది? కారణమిదే!
LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget