విజయ్ ఆంటోనీ అసలు పేరు, బ్యాగ్రౌండ్ తెల్సా? అతని లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

విజయ్ ఆంటోనీ అసలు పేరు ఫ్రాన్సిస్ ఆంటోనీ సిరిల్ రాజా. జూలై 24, 1975లో జన్మించాడు.

ఇండస్ట్రీలోకి 'అగ్ని' పేరుతో వచ్చాడు. 'అగ్ని' లక్కీ కాదని, విజయ్ ఆంటోనీగా దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పేరు మార్చారు.

విజయ్ ఆంటోనీది కన్యాకుమారిలోని నగర్ కోయిల్. అతని ముత్తాత సామ్యూల్ వేదనాయగం పిళ్ళై తమిళ కవి. 

విజయ్ ఆంటోనీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి తల్లి పెంచింది. 

సౌండ్ ఇంజనీర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ... ఏయం రత్నం కుమారుడు రవికృష్ణ 'శుక్రాన్'తో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. 

'శుక్రాన్'కు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శక నిర్మాత. దానికి ముందు జీవా 'డిష్యుం'కి ఛాన్స్ వచ్చినా అది లేటుగా విడుదలైంది.

'నాకు ముక్క' సాంగ్ విజయ్ ఆంటోనీని వైరల్ చేసింది. 'మహాత్మా'తో సంగీత దర్శకుడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. 

'నాన్' (తెలుగులో 'నకిలీ')తో విజయ్ ఆంటోనీ హీరో అయ్యాడు. తెలుగులో 'బిచ్చగాడు' అతడిని స్టార్ చేసింది.

విజయ్ ఆంటోనీ భార్య పేరు ఫాతిమా. వీళ్లకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మీరా సెప్టెంబర్ 19, 2023లో ఆత్మహత్య చేసుకుంది.