Bhartha Mahasayulaki Wignyapthi Songs : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' మాస్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది - ఇద్దరు భామలతో రవితేజ మాస్ డ్యాన్స్
Vaammo Vaayyo Song : మాస్ మహారాజ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' నుంచి మాస్ సాంగ్ వచ్చేసింది. 'వామ్మో వాయ్యో' అంటూ ఇద్దరు భామలతో రవితేజ డ్యాన్స్ ఫుల్ జోష్ తెప్పిస్తోంది.

Ravi teja's Bhartha Mahasayulaku Wignyapthi Mass Song Vaammo Vaayyo Out : మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ మూవీ నుంచి తాజాగా మాస్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.
ఇద్దరు భామలతో మాస్ డ్యాన్స్
ఈ పాటలో ఇద్దరు హీరోయిన్స్‌తో మాస్ మహారాజ మాస్ బీట్ అదిరిపోయింది. 'ఇల్లు పాయె... ఒళ్లు పాయే గా లచ్చుదాని హెచ్చులు పాయె... వామ్మో వాయ్యో...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. పక్కా మాస్ లిరిక్స్‌తో ఇద్దరు భామలతో రవితేజ ఎనర్జిటిక్ డ్యాన్స్ అదిరిపోయింది. ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ అందించగా... స్వాతి రెడ్డి ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.
Also Read : 'ది రాజా సాబ్' లవ్ సాంగ్ 'రాజే యువరాజే' - నో వీడియో... ఓన్లీ క్యూట్ లిరిక్స్
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లవ్ సాంగ్ 'అద్దం ముందు' ట్రెండ్ అవుతోంది. లుక్స్, గ్లింప్స్, టీజర్ అదిరిపోయాయి. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రవితేజ రెడీ అయిపోయారు. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా... వెన్నెల కిశోర్, సునీల్, మురళీధర్ గౌడ్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా... ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
The trio is here with the festival banger 💥💥💥
— SLV Cinemas (@SLVCinemasOffl) January 2, 2026
Speaker on 🔊
Mass vibes on ❤🔥
Wignyapthi 5:#VaammoVaayyo Song from #BharthaMahasayulakuWignyapthi out now 🤩
▶️ https://t.co/SDjk6JUssR#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026 ❤🔥@RaviTeja_offl… pic.twitter.com/olgMWgQ9VR






















