Mahakumbha mela: మహా కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా గ్లామరస్ సాధ్వీలు కూడా - హాట్ టాపిక్ గా హర్ష రిచారియా !
Harsha Richhariya: మహాకుంభమేళాలో వైరల్ మహిళా స్వామిగా హర్ష రిచారియా నిలిచారు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ అయిన ఈమె ఇప్పుడు సాధ్వీగా మారారు.
Prayagraj Mahakumbh: ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. తొలి రోజే కోటిన్నర మంది కుంభమేళా స్నానాలు చేశారు.దేశం నలుమూలల నుంచి అనేక మంది స్వాములు వచ్చి అక్కడ అథ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్నారు. ఈ స్వాముల మధ్య హర్ష రిచారియా అనే మరో మహిళా స్వామిజీ కూడా ఇందులో ఒకరు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ రిచారియా మాత్రం వైరల్ అవుతున్నారు. ఎందుకంటే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ అలాంటిది మరి.
మహాకుంభమేళాలో హర్ష రిచారియా సాధ్విగా అకస్మాత్తుగా కనిపించారు. ప్రజలు ఆమె గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా చూపించారు. హర్ష రిచారియా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 970K ఫాలోయర్స్ ఉన్నారు. కంటెంట్ క్రియేటర్ గా ఆమె గతంలో గ్లామర్ ఒలకబోసేవారు. అలాంటి మహిళ ఒక్క సారిగా సాధ్వీగా కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకిలా అయ్యారని.. ఆమె సాధ్వీగా మారడంపై సందేహాలు ఉన్నాయని అంటున్నారు.
Harsha Richhariya is an actress,
— Narayan Lal Gurjar (@ImNarayanG) January 13, 2025
host & a devout Hindu. That's it! pic.twitter.com/X2xIbMlNqX
X సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు హర్ష రిచారియా ఆకస్మిక ఆధ్యాత్మిక మార్పుపై చాలా మమంది అనుమానాలు లేవనెత్తుతున్నారు. రెడేళ్ల నుంచి తాను సాధ్వీగా మారానని ఆమె చెబుతున్నారు. కానీ రెండు నెలల క్రితం కూడా ఆమె గ్లామర్ ఫోటోలు తన సోషల్ మీడియాలో ఖాతాలో పెట్టారు. అందుకే రెండేళ్ల నుంచి సాధ్వీగా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల క్రితం హర్ష రిచారియా దుబాయ్‌లో ఎరుపు రంగు పొట్టి దుస్తులు ధరించి ఉన్నట్లు ఒక రీల్‌లో నటించారు. ఇప్పుడు తాను సాధ్వీని అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.
Kumbh me keh rahi hai 2 saal se Sadhvi hu..🤦♂️🤦♂️🥴
— 🇮🇳Rohit🇮🇳 (@Rohit_p__) January 13, 2025
Kuch hafte pehle ki Dubai ki reel 👇🥴
Aur humari media as usual bina enquiry kiye iski media byte daal ke famous kar rahi hai ise..🤦♂️🤦♂️🥴 pic.twitter.com/QZcGt0EgFG
కొంతమంది నెటిజన్లు ఆమె మత సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. మరికొందరు ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ కోసం కోసం ఆధ్యాత్మికతను ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఆమె సాధ్వీగా కనపించలేదని గుర్తు చేస్తున్నారు. అయితే తాను సాధ్వీగా మారానని హర్ష రిచారియా తన ఇంటర్వ్యూలో చెబుతున్నారు. నిరంజని అఖాడా నాయకుడు ఆచార్య మహామండలేశ్వర్ స్వామి శ్రీ కైలాష్‌నందగిరి జీ మహారాజ్ అనుచరురాలిగా మారానని.. ఉత్తరాంఖండ్ తన స్వస్థలమని హర్ష రిచారియా చెబుతున్నారు.
మహాకుంభమేళా పుణ్యమా అని.. ఇప్పుడు హర్ష రిచారియా దేశవ్యాప్తంగా వైరల్ సాధ్వీగా మారారు.