ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళా 2025 కు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు తరలివస్తారు.

చివరిసారిగా 2019లో ఇక్కడ జరిగిన అర్థ కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా.

అమృతం కోసం దేవ దానవుల మధ్య జరిగిన యుద్ధంలో కలశం నుంచి అమృత బిందువులు పడిన చోటే కుంభమేళా జరుగుతుంది .

పుష్య మాసం పౌర్ణమి తిథి రోజున మహాకుంభం మొదటి రాజ స్నానం చేయనున్నారు.

నాగ సాధువులు మహాకుంభంలో ముందుగా రాజ స్నానం చేస్తారు. గృహస్తులు నాగ సాధువుల తర్వాతే సంగమంలో స్నానం చేయాలి.

స్నానం , దానం తర్వాత ఖచ్చితంగా బడే హనుమంతుడు, నాగవాసుకి దర్శనం చేసుకోవాలి.

మహా కుంభ మేళా జాతర సందర్భంగా గంగా నదిలో స్నానమచారించాలంటే నుదుటిపై తిలకం, మణికట్టుకి పవిత్రమైనదారం తప్పనిసరి.