ఎవరెస్టులో మంచు సమాధులు!
జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించాలనేది ఎందరో పర్వతారోహకుల ఆకాంక్ష
ఆ కలను నెరవేర్చుకునే క్రమంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కొందరు మధ్యలోనే మృత్యువాత పడుతున్నారు
కొందరు మొండిగా ముందుకెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు.. గడిచిన వందేళ్లలో ఆ లెక్క ఎక్కువే ఉంది...
1921 నుంచి 2024 వరకూ శబాబ్ధకాలంలో దాదాపు 340 మంది ఎవరెస్టుని అధిరోహించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు
340 మందిలో నేపాల్ వాసులు అధికంగా ఉన్నారు.. వందేళ్లలో 135 మంది నేపాల్ దేశస్థులు మృత్యువాత పడ్డారు
ఎవరెస్టుని అధిరోహిస్తూ ప్రాణాలు కోల్పోయిన భారతీయులు వందేళ్లలో 28 మంది ఉన్నారు
జపాన్ 19 , యూకే 19, అమెరికా 17, చైనా 12, దక్షిణ కొరియా 111, ఆస్ట్రేలియా 9, రష్యా 9, జర్మనీ 7
ఎవరెస్టు అధిరోహించడం సాధారణ విషయం కాదు..శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది
ఎంతో కఠిన శిక్షణ తీసుకున్నా కొందరు ఎవరెస్టు బేస్ క్యాంప్‌లోకి అడుగుపెట్టగానే వివిధ అడ్డంకుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు