8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 30శాతం పెరగనున్న జీతం
8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను సవరించే లక్ష్యంతో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం ప్రకటించింది.

8th Pay Commission:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను సవరించే లక్ష్యంతో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం ప్రకటించింది. 7వ వేతన సంఘం పదవీకాలం 2026లో ముగియనున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం 49 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు , దాదాపు 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.
7వ వేతన సంఘం పదవీకాలం ముగియడానికి చాలా ముందుగానే దాని సిఫార్సులు అందేలా చూసుకోవడానికి 2025లో కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 1947 నుండి భారతదేశం ఏడు వేతన సంఘాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కటి ప్రభుత్వ ఉద్యోగుల జీత నిర్మాణాలు, భత్యాలు, ఇతర ప్రయోజనాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2014లో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2016న అమలులోకి వచ్చాయి.
జీతాల పెంపుదల అంచనా
8వ వేతన సంఘం 25శాతం నుంచి 35శాతం మధ్య జీతాల పెంపును సిఫార్సు చేస్తుందని అంచనా. అలాగే డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA) వంటి భత్యాలలో మెరుగుదలలను కూడా సిఫార్సు చేస్తుంది. పెన్షనర్లు 30శాతం వరకు పదవీ విరమణ ప్రయోజనాల పెంపును కూడా ఆశించవచ్చు.
పెన్షన్లు భారీ పెంపును చూస్తాయా?
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ జీతాలను ఎలా ప్రభావితం చేస్తుంది
పే స్కేళ్లను సవరించడంలో ఉపయోగించే కీలకమైన గుణకం అయిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పే కమిషన్ సిఫార్సులలో అంతర్భాగం. 7వ వేతన సంఘం కింద సాధారణ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని నెలకు రూ.7,000 నుండి రూ.18,000కి పెంచింది. సవరించిన జీతాలను నిర్ణయించడానికి 8వ వేతన సంఘం కింద ఇలాంటి యంత్రాంగం ఉంటుందని భావిస్తున్నారు.
హౌస్ రెంట్ అలవెన్ (HRA) విభజన
డీఏ పెరుగుదల ఆధారంగా, HRA సర్దుబాట్లు ఈ క్రింది విధంగా అమలవుతాయి
- టైప్ X నగరాలు: బేసిక్ సాలరీలో 30%
- టైప్ Y నగరాలు: బేసిక్ సాలరీలో 20%
- టైప్ Z నగరాలు: బేసిక్ సాలరీలో 10%
ఉదాహరణ: రూ.35,000 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి:
- టైప్ X నగరం: రూ.10,500
- టైప్ Y నగరం: రూ.7,000
- టైప్ Z నగరం: రూ.3,500
అదనపు భత్యాలు పెరుగుతాయని అంచనా
8వ వేతన సంఘం కూడా అనేక భత్యాలను పెంచే అవకాశం ఉంది, వీటిలో ఇవి ఉన్నాయి:
- పిల్లల విద్యా భత్యం(Children's Education Allowance)
- పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక భత్యం(Special Allowance for Childcare)
- హాస్టల్ సబ్సిడీ(Hostel Subsidy)
- బదిలీపై రవాణా భత్యం(Transport Allowance on Transfer)
- గ్రాట్యుటీ సీలింగ్(Gratuity Ceiling)
- దుస్తుల భత్యం(Dress Allowance)
- సొంత రవాణా కోసం మైలేజ్ భత్యం(Transport Allowance on Transfer)
- రోజువారీ భత్యం(Daily Allowance)
టార్గెట్, అమలు తేదీ
ప్రధాన లక్ష్యం 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, ప్రయోజనాలు, పెన్షన్లను ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ రేటుకు అనుగుణంగా మార్చనుంది. అధికారిక తేదీ ప్రకటించనప్పటికీ సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ చర్య ఆర్థిక ఉపశమనం, మెరుగైన ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన జీవన నాణ్యతను అందించడానికి ఉద్దేశించబడింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

