అన్వేషించండి

Sleeping with a Pillow : దిండుతో పడుకుంటే మంచిదా? లేకుండా నిద్రపోతే మంచిదా? సరైన తలగడను ఎలా ఎంచుకోవాలి?

Right Pillow : మీకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అంటే దానికి ఓ కారణం మీ దిండు కూడా కావొచ్చు. అందుకే ఎలాంటి తలగడను ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

Pros and Cons of Sleeping with a Pillow : మెరుగైన నిద్రలో తలగడ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. లేదంటే నిద్ర రావడం అటుంచి.. ఇతర శారీరక సమస్యలు వస్తాయి అంటున్నారు. దిండు వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ తలగడతో పడుకుంటే మంచిదా? దిండు లేకుండా పడుకుంటే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు పిల్లో లేకుండా పడుకోవచ్చా? ఎలాంటి దిండు ఎంచుకుంటే మంచిది?

దిండుతో కలిగే లాభాలు

  • మెడ, వెన్నెముకకు.. దిండుతో నిద్రపోవడం వల్ల మెడ, వెన్నుముక అమరికకు సపోర్ట్ దొరుకుతుంది. దీనివల్ల నడుము నొప్పి, మెడనొప్పి వంటి తగ్గుతాయి. అలాగే ఒత్తిడి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ మెడభాగంలో ఉంటుంది. అది దిండుపై రిలాక్స్ అయినప్పుడు ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • కంఫర్ట్.. తలగడ అనేది మీ తల, మెడకు సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే మీరు విశ్రాంతి తీసుకోవడంలో, వేగంగా నిద్రపోవడంలో హెల్ప్ చేస్తుంది. కంఫర్ట్​గా ఉండి.. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది. 
  • గురక తగ్గుతుందట.. గురక, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలున్నవారు దిండు ఉపయోగిస్తే మంచిదట. ఎందుకంటే.. తలను ఓ దిండుతో పైకి లేపడం వల్ల మీ శ్వాసనాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల గురక, స్లీప్ ఆప్నియా తగ్గుతుంది. 

దిండుతో కలిగే నష్టాలివే.. 

  • అలెర్జీ.. దిండును శుభ్రంగా ఉంచకపోయినా.. పిల్లో కవర్స్ రెగ్యులర్​గా మార్చకపోయినా దానిలో దుమ్ము పురుగులు ఉంటాయి. బూజు వంటి అలెర్జీ కారకాలు పెరుగుతాయి. ఇవి ఆస్తమా వంటి శ్వాస సమస్యలను పెంచుతాయి. 
  • మెడ నొప్పి.. దిండు మెడనొప్పిని తగ్గిస్తుంది. కానీ బాగా మందంగా ఉండే లేదా బాగా సన్నగా ఉండే తలగడను ఉపయోగించడం ద్వారా మెడనొప్పితోపాటు వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఇది వెన్నెముక అమరికకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి సరైన దిండును ఎంచుకోవాలి. 
  • నిద్ర సమస్యలు.. చాలామంది బాగా మృదువైన లేదా దృఢమైన దిండును ఉపయోగిస్తారు. ఈ రెండు నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తాయి. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం దీనిలో భాగమవుతాయి. దీనివల్ల మీరు పగలు ఏపని చేయలేరు. అలసిపోతారు. 

సరైన దిండు ఎలా ఎంచుకోవాలంటే.. 

దిండు కొనుక్కునేప్పుడు కచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మీ మెడకు సపోర్ట్ చేసే, వెన్నెముకకు ఇబ్బంది కలిగించని దిండును ఎంచుకోవాలి. మీరు పడుకునే పొజిషన్ బట్టి కూడా పిల్లోని ఎంచుకోవాలి. సైడ్ స్లీపర్స్ సాఫ్ట్​గా ఉండే దిండు ఎంచుకోవాలి. బ్యాక్​ స్లీపర్స్ ఫిర్మర్ పిల్లో వాడితే మంచిది. మెమరీ ఫోమ్ లేదా రబ్బరు పాలతో చేసే హైపోఅలెర్జెనిక్ పిల్లోలు కూడా మంచి ఆప్షన్. మీ దిండును క్రమం తప్పకుండా మార్చాలి. కనీసం 1 లేదా రెండు సంవత్సరాలకు ఓసారి దిండును మార్చితే అలెర్జీలు రాకుండా ఉంటాయి. 

దిండు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర మెరుగవడంతో పాటు.. మెడనొప్పి, వెన్ను నొప్పి కూడా దూరమవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దిండు పరిస్థితి ఏంటో.. ఎలాంటి దిండు మీకు సెట్​ అవుతుందో చూసి మార్చేయండి. 

Also Read : పిల్లలతో తల్లిదండ్రులు ఈ విషయాలు కచ్చితంగా మాట్లాడాలి.. టీనేజర్స్​కు ఇవ్వాల్సిన రిలేషన్​షిప్​ సూచనలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Embed widget