Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఉద్దేశంతో కొంత మంది మహిళలు లైంగిక వేధింపులని ఇతరులపై నిందలేస్తున్నారు. ఇలా ఓ మహిళ చేసిన కుట్రకు ఓ వ్యక్తి ఆత్మహ్తయ చేసుకోవాల్సి వచ్చింది.

Kerala Mansuiside: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తప్పు చేశాడని మహిళ ఆరోపించింది. ఆ నిందలు భరించలేక ఆ వ్యక్తి చనిపోయాడు. రద్దీ బస్‌లో లైంగిక వేధింపులంటూ ఉద్దేశపూర్వకంగా ఓ మహిళ చేసిన వీడియో ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణం కావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
కొద్దిరోజుల క్రితం పయ్యన్నూరులో రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, దీపక్ తనను అసభ్యకరంగా తాకాడంటూ ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సుమారు 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించడమే కాకుండా, పెద్ద ఎత్తున షేర్ అయింది. దీంతో దీపక్ ఒక్కసారిగా నిందలకు గురయ్యాడు. అయితే, కేవలం పబ్లిసిటీ కోసమే సదరు మహిళ ఆ వీడియోను చిత్రీకరించిందని, కావాలనే నిందలు వేసిందని దీపక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వీడియో వైరల్ అయినప్పటి నుండి దీపక్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన బంధువులు, స్నేహితులు తెలిపారు. ఆ వీడియో ద్వారా అతడి క్యారెక్టర్‌ను దారుణంగా దెబ్బతీశారు. నిజానిజాలు తెలియకుండానే నెటిజన్లు చేసిన ట్రోలింగ్ ఆయనను కృంగదీసిందని వారు వాపోయారు. ఆదివారం ఉదయం ఎంత పిలిచినా గది తలుపులు తీయకపోవడంతో, అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పొరుగువారి సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఫ్యాన్‌కు వేలాడుతున్న కొడుకును చూసి వారు కుప్పకూలిపోయారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది ఆత్మహత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. కంటిపాపలా చూసుకోవాల్సిన వయసులో కొడుకును కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రుల రోదనలు చూసి అక్కడ ఉన్నవారందరూ కన్నీరుమున్నీరయ్యారు.
A 42-year-old man, against whom a video alleging misbehaviour with a woman passenger on a bus had surfaced on social media, was found hanging dead at his residence on Sunday, police said.
— Hate Detector 🔍 (@HateDetectors) January 18, 2026
The deceased was identified as Deepak U, a native of #Puthiyara, who was residing at… https://t.co/1yky0cy4ar pic.twitter.com/d4y5dTSO6E
ఏ తప్పూ చేయకుండానే సమాజం ముందు దోషిగా నిలబడటం భరించలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. సమాచారం అందుకున్న కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఆ వీడియో కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.






















