అన్వేషించండి

Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

MLC Shravan: రేవంత్ రెడ్డి తీరు ఫ్యాక్షన్ నాయకుడిలా ఉందని ఎమ్మెల్సీ శ్రవణ్ విమర్శించారు. కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చశారు.

MLC Shravan criticized Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, ఆయన వాడుతున్న హింసాత్మక భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ విడుదల చేసిన అనంతరం, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌కు సీఎంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి  పాతిపెట్టండి ,  బొంద పెట్టండి  వంటి పదజాలం వాడటం చూస్తుంటే, ఆయన ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నేతలా కాకుండా ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ఈ ప్రసంగాలు నేరపూరిత కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.                                   

రేవంత్ రెడ్డి రాజకీయ పయనంపై శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. కప్పుకున్నది కాంగ్రెస్ జెండా అయినా, రేవంత్ ఆత్మ మాత్రం టీడీపీదే అని ఎద్దేవా చేశారు. తన పాత యజమాని చంద్రబాబు నాయుడి అజెండాను అమలు చేస్తూ తెలంగాణలో టీడీపీని మళ్ళీ బలోపేతం చేసేందుకు రేవంత్  ప్లాన్-బి ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ, సొంత పార్టీలోని సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారిని క్రమపద్ధతిలో అణిచివేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానాన్ని నమ్మిస్తూనే, మరోవైపు టీడీపీ, బీజేపీలతో రేవంత్ కోవర్ట్ సంబంధాలు నెరుపుతున్నారని ఆయన ఆరోపించారు.     

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ, రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీ  వంటి డొల్ల వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని శ్రవణ్ విమర్శించారు. సంపద సృష్టించే తెలివి లేక రంగుల కలలు చూపిస్తున్నారని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కేసీఆర్ ప్రజల గుండెల్లో  జాతిపిత గా నిలిచిపోతారని, అటువంటి మహనీయుడిని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. 

 అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ముఖ్యమంత్రి తన అహంకారాన్ని వీడకపోతే అది ఆయన వినాశనానికి దారితీస్తుందని శ్రవణ్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాల్సింది పోయి, రౌడీ భాషతో విపక్షాలను భయపెట్టాలని చూడటం సరికాదని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.                    

                          

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget