అన్వేషించండి

Renu Desai on Dogs: కొన్ని కుక్కలు అగ్రెసివ్‌గా ఉంటే అన్ని కుక్కల్ని చంపేస్తారా? - రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Renu Desai: కుక్కలను చంపడాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కుక్కల బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Renu Desai strongly opposes killing of dogs:  మద్యం తాగి, వాహనాలు నడిపడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ప్రభుత్వాలు మద్యం దుకాణాలను ఎందుకు మూసివేయడం లేదని నటి, సామాజిక కార్యకర్త రేణుదేశాయ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు .. ఎన్జీవోల విషయంలో చేసిన వ్యాఖ్యలపై పునరాలోచించాలని కోరారు.  కుక్కల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుకూ పలు ప్రశ్నలు సంధించారు.   ప్రెస్మీట్‌లో  రేణుదేశాయ్‌తో పాటు యాంకర్ రష్మిగౌతమ్ కూడా పాల్గొన్నారు.                          

కుక్కలన్నీ ప్రమాదకరం కాదు: రేణు దేశాయ్               

వీధి కుక్కల సమస్యపై స్పందిస్తూ రేణు దేశాయ్ భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా ఒక కుక్క తప్పు చేస్తే లేదా ఒక అపశ్రుతి చోటుచేసుకుంటే, ఆ ప్రాంతంలోని వందలాది కుక్కలను చంపడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.  ప్రతి కుక్క ప్రమాదకరమైనది కాదు. ఒక కుక్క చేసిన తప్పుకు జాతి మొత్తాన్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం అని ఆమె ప్రశ్నించారు. మూగజీవాల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
బాధ్యత తీసుకోవడానికి సిద్ధం                 

చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు తనను కూడా కలిచివేస్తున్నాయని చెబుతూనే, వాటిని చంపడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఆమె సూచించారు. ఎక్కడైనా కుక్కలు పిల్లలకు హాని చేస్తున్నాయని భావిస్తే, ఆ ప్రాంతాల వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. అలాంటి కుక్కల బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా లాంటి యానిమల్ లవర్స్‌కు వాటిని అప్పగించండి, మేము వాటిని సంరక్షిస్తాము అని రేణు దేశాయ్ ప్రకటించారు.

మద్యం దుకాణాల ఉదాహరణతో ప్రశ్నలు

ఈ సందర్భంగా ఆమె సమాజంలోని ఇతర సమస్యలతో కుక్కల అంశాన్ని పోల్చారు. ప్రతిరోజూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, మరి ఆ కారణంతో ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేస్తోందా? అని నిలదీశారు. మనుషులు చేసే తప్పులకు లేని కఠిన నియమాలు, కేవలం మూగజీవాల విషయంలోనే ఎందుకు అమలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 
పరిష్కారం చంపడం కాదు!

వీధి కుక్కల సమస్యకు పరిష్కారం వాటిని చంపడం కాదని, సరైన పద్ధతిలో జంతు నియంత్రణ చర్యలు  చేపట్టాలని ఆమె సూచించారు. కుక్కలకు ఆహారం అందకపోవడం, వాటి ఆవాసాలను దెబ్బతీయడం వల్లనే అవి అసహనానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు, ప్రభుత్వం కలిసికట్టుగా శాస్త్రీయమైన పద్ధతుల్లో ఈ సమస్యను పరిష్కరించాలే తప్ప, హింసను ప్రోత్సహించకూడదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget