Love and Relationship Advices : పిల్లలతో తల్లిదండ్రులు ఈ విషయాలు కచ్చితంగా మాట్లాడాలి.. టీనేజర్స్‌కు ఇవ్వాల్సిన రిలేషన్షిప్ సూచనలివే
Parental Guidance : పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే తలిదండ్రులు కేవలం సంపాదించడం కాదు.. వారికి కొన్ని పర్సనల్ అడ్వైస్లు ఇస్తూ ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో..
Advice from Parents for Teenage Girls and Boys : చాలామంది పేరెంట్స్ చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే పిల్లలతో కమ్యూనికేట్ చేయకపోవడం. పిల్లలకు కావాల్సినంత డబ్బులు సంపాదిస్తారు కానీ.. వారితో కూర్చొని మాట్లాడే టైమ్ మాత్రం ఇవ్వరు. దీనివల్ల పేరెంట్స్, పిల్లల మధ్య గ్యాప్ బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. సగం మంది పిల్లలు చెడు సావాసాలకు, చెడు అలవాట్లకు బానిసలవ్వడానికి ఇదే కారణమట. పైగా టీనేజర్స్‌లో ఇది డిప్రెషన్‌కు దారి తీస్తుందని చెప్తున్నారు.
మారుతున్న కాలంతో పాటు జెనరేషన్లో మార్పులు వచ్చేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రిలేషన్షిప్స్ గురించి. ఈ రిలేషన్షిప్స్ వల్ల ఎంతోమంది వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారట. వీటిని ఎవరితో చెప్పుకోవాలో తెలీక.. వారిలో వారే మథనపడిపోతున్నారట. చివరికి పేరెంట్స్‌తో కూడా వారు కొన్ని విషయాలు చెప్పుకోలేకపోతున్నారట. అందుకే పేరెంట్స్ పిల్లలకు రిలేషన్షిప్ అడ్వైస్లు ఇస్తే మంచిదంటూ నిపుణులు సూచిస్తున్నారు.
రిలేషన్షిప్ విషయంలో అబ్బాయిలకు ఓ రకమైన సూచనలు ఇస్తే అమ్మాయిలకు కొన్ని సూచనలు ఇవ్వాలి. పిల్లలతో ఈ విషయాలు ఓపెన్‌గా డిస్కస్ చేయకుంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఈ విషయాలు చెప్పి ఉంటే బాగుండేదని మీరు కూడా ఏదొక సందర్భంలో ఫీల్ అయ్యి ఉంటారు. అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో మీ పిల్లలకు రాకూడదనుకుంటే ఇప్పుడే వాటిని సిగ్గు పడకుండా చెప్పాలి. అలాగే వారు మిమ్మల్ని ఏదైనా సలహా కోసం అడిగినప్పుడు వారిని జడ్జ్ చేయకపోవడమే మంచిది.
మగ పిల్లలకు ఇవ్వాల్సిన సూచనలివే..
ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకుంటానని అబద్ధం ఆడొద్దు. నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటేనే ఈ విషయం అవతలి వాళ్లకి చెప్పాలి. అలాగే ఆమె ఏ కారణం చెప్పి అయినా నీ నుంచి వెళ్లిపోతే ఆ అమ్మాయిని బ్లేమ్ చేయకుండా.. నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకుండా మూవ్ అన్ అయిపో. ఆమె గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ లేదా తన జీవితాన్ని ఏదో చేయాలని స్ట్రక్ అయిపోకుండా ఓవర్కామ్ చేయి. ఏది జరిగినా నీవెంట మేము ఉన్నాము. ఉంటాము. ఓ రిలేషన్షిప్లో నీకు ఎంత క్లారిటీ ఉందో.. అవతలి వాళ్లకి కూడా అంతే క్లారిటీ ఉందో లేదో చెక్ చేసుకో. ఏ అమ్మాయిని తిట్టడం, ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు మరో అమ్మాయి జోలికి వెళ్లడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకు. అలాగే అమ్మాయి ఫీలింగ్స్‌ని రెస్పెక్ట్ చేయి. రిలేషన్లో ఉన్నా లేకున్నా ఏ అమ్మాయిని తప్పుగా చూడడం లేదా మాట్లాడడం చేయకు. వంటి సూచనలు పేరెంట్స్ అబ్బాయికి ఇవ్వొచ్చు.
అమ్మాయిలకు ఇవ్వాల్సిన అడ్వైస్లు ఇవే..
పేరెంట్స్ ఒప్పుకోరు.. కుల, మతపరమైన కారణాలు చెప్పేలా ఉంటే.. ఏ అబ్బాయికి నీపై హోప్స్ ఇవ్వకు. పెళ్లి చేసుకుంటాను అని నమ్మకం ఉన్నప్పుడే రిలేషన్లోకి వెళ్లు. అలాగే ఏ అబ్బాయి అయినా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే.. అతనికి నీ పరిస్థితి అర్థమయ్యేలా చెప్పి సైడ్ అయిపో. అతను మాట వినకుంటే.. అప్పుడే మా దగ్గరకు లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర ఈ విషయం చెప్పు. అలాగే రిలేషన్లో ఉన్నప్పుడు అబ్బాయి ఎంతగా అడిగినా.. రిక్వెస్ట్ చేసినా ప్రైవేట్ ఫోటోలు పంపకు. బయటకు వెళ్లినా నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండాలి. ఎవరైనా బలవంతం చేస్తుంటే నీ డిఫెన్స్ నువ్వు చేసుకోగలను అనుకునేలా ప్రిపేర్ అవ్వాలి.
అవసరాల కోసం ఏ వ్యక్తి ఎమోషన్స్‌తోనూ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆడుకోకుండా ఉండాలని సూచించాలి. అలాగే మీ పిల్లలు మీ దగ్గరికి రిలేషన్ అడ్వైస్కోసం వస్తే వారిని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే రిలేషన్షిప్లో మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ రాకుండా చూసుకోమని చెప్పాలి. శారీరకంగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ప్రొటెక్షన్ ఉపయోగించడం అనేది హెల్తీ హ్యాబిట్‌గా చెప్పాలి. పేరెంట్స్ ఈ విషయం చెప్పడానికి ఇబ్బంది పడొచ్చు. కానీ చెప్పాల్సిన బాధ్యత కూడా వారిదే. దీనివల్ల వారికి ఇతర ఇబ్బందులు రావు. అలాగే ఇతరుల పేర్లు టాటూ వేయించుకోకపోవడమే మంచిదని చెప్పాలి. ఇవి మీ పిల్లల ఫ్యూచర్‌కి చాలా మంచివి. రిలేషన్ షిప్, శారీరక సంబంధాల గురించి పేరెంట్స్ పిల్లలతో ఎంత త్వరగా డిస్కస్ చేసి అడ్వైస్ ఇస్తే అంత మంచిది.
Also Read : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్లో అమ్మాయిలదే హవా