అన్వేషించండి

Identity Telugu Release: మలయాళంలో బ్లాక్‌బస్టర్‌... రెండు వారాల్లో 50 కోట్లు సాధించిన త్రిష 'ఐడెంటిటీ' తెలుగు రిలీజ్‌ ఎప్పుడంటే?

Identity Telugu Version Theatrical Release: త్రిష మలయాళంలో నటించిన మూవీ 'ఐడెంటిటీ' విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్‌ థ్రిల్లర్‌ తెలుగు వెర్షన్‌ విడుదల తేదీని ఫిక్స్‌ చేసుకుంది. 

Trisha's Identity Telugu Version Release Date: ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండ సినిమాలు అన్ని ఇండస్ట్రీలో అలరిస్తున్నాయి. ఒక భాష సినిమా మరో భాషలో మంచి ఆదరణ పొందడమే కాదు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంటున్నాయి. ఎన్నో తమిళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయ్యి ఆడియన్స్‌ని మెప్పిస్తున్నాయి. అలాగే మలయాళ, కన్నడ సినిమాలకు కూడా తెలుగులో మంచి గుర్తింపు పొందాయి. మలయాళంలో ఎక్కువగా క్రైం థ్రిల్లర్‌ సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇన్వెస్టిగేటివ్‌, క్రైం థ్రిల్లర్స్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో ఇన్వెస్టిగేషన్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్లో వచ్చిన సినిమా 'ఐడెంటిటీ'. స్టార్‌ హీరోయిన్‌ త్రిష, టోవినో థామస్‌, మందిరా బేడీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 2న మలయాళంలో విడుదలైంది.

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. రెండు వారాల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టి  మలయాళ ఇండస్ట్రీకి తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించింది. దర్శక ద్వయం అఖిల్‌ బాయ్‌, అనాస్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం మాలీవుడ్‌ థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుంది. మాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్‌ కాబోతోంది. మాక్స్‌ శ్రీనివాస్‌ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర చింతపల్లి రామారావు కలిసి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. కాగా చాలా గ్యాప్‌ తర్వాత త్రిష డబ్బింగ్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఆమె ఫ్యాన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో త్రిష కూడా పెద్ద ఎత్తున్న యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది. 

రీఎంట్రీలో దూసుకుపోతున్న త్రిష

కొంతకాలం త్రిష నటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు స్ట్రయిట్‌ మూవీ చేసి చాలా కాలం అవుతుంది. మణిరత్నం పొన్నియిన్‌ సెల్వన్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో కుందవై అనే యువరాణి పాత్రలో తన గ్లామర్‌తో కనువిందు చేసింది. ఒకప్పుడు సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన త్రిష రీఎంట్రీలోనూ అదే జోరు చూపిస్తుంది. తమిళ్‌లో లియో నుంచి మొదలు వరసగా భారీ బడ్జెట్‌, అగ్ర హీరో సినిమాల్లో గ్లామరస్‌ పాత్రలు అందుకుంటుంది. ఆమె నటించి చిత్రాలన్ని కూడా మంచి విజయం సాధించించాయి. ప్రస్తుత తమిళం, తెలుగులో ఆమె స్టార్ హీరోల సరసన పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది.

Also Read: నీ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి -  తమన్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌పై చిరంజీవి రియాక్షన్

చిరుతో విశ్వంభర, అజిత్‌తో రెండు సినిమాలు

తమిళంలో అజిత్‌తో 'విడాముయార్చి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో అజిత్‌ నటిస్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లీలోనూ త్రిషనే హీరోయిన్‌. ఇక తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తోంది. స్టాలిన్‌ లాంటి సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఇలా రీఎంట్రీలో హిట్స్‌, బ్లాకబస్టర్‌ హిట్స్‌ అందుకుంటున్న ఈ చెన్నై బ్యూటీ ఇప్పుడు ఐడెంటిటీతో మాలీవుడ్‌లోనూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది.  ఇక ప్రస్తుతం స్టార్‌ హీరో సినిమాల్లో నటిస్తున్న త్రిష మాలీవుడ్‌లో టోవినో థామస్‌ సరసన నటించడం విశేషం. యాక్షన్‌, థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో త్రిష కూడా పలు యాక్షన్ సన్నివేశాల్లో నటించి అదరగొట్టింది.  ఇప్పుడు ఈ సినిమాతో తెలుగులోనూ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతుంది. 

Also Readనేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu News: దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
Vijayasai Reddy Resignation: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
Jammu Shootout: రిపబ్లిక్​ డే ముందు ఉగ్రవాదుల దుశ్చర్య.. జమ్ములో ఆర్మీ క్యాంప్​పై దాడితో ఢిల్లీలో అలర్ట్
రిపబ్లిక్​ డే ముందు ఉగ్రవాదుల దుశ్చర్య.. జమ్ములో ఆర్మీ క్యాంప్​పై దాడితో ఢిల్లీలో అలర్ట్
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Video on Seize the Lion | కటకటాల వెనక్కి సింహం...రాజమౌళి పెట్టిన పోస్ట్ అర్థం ఇదే | ABP DesamVijaya Sai Reddy Quit Politics | రాజకీయాలు వదిలేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటన | ABP DesamRachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP DesamMS Dhoni Rare Seen With Mobile | ప్రాక్టీస్ సెషన్ లో మొబైల్ తో ధోనీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu News: దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
Vijayasai Reddy Resignation: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి
Jammu Shootout: రిపబ్లిక్​ డే ముందు ఉగ్రవాదుల దుశ్చర్య.. జమ్ములో ఆర్మీ క్యాంప్​పై దాడితో ఢిల్లీలో అలర్ట్
రిపబ్లిక్​ డే ముందు ఉగ్రవాదుల దుశ్చర్య.. జమ్ములో ఆర్మీ క్యాంప్​పై దాడితో ఢిల్లీలో అలర్ట్
Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
Noman Ali: పాక్ స్పిన్నర్ నోమన్ అలీ అరుదైన ఘనత, టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా
పాక్ స్పిన్నర్ నోమన్ అలీ అరుదైన ఘనత, టెస్టు క్రికెట్‌లో తొలిసారిగా
Chalaki Chanti: జీవితంలో అలాంటి రోజు ఎవ్వడికీ రావొద్దు... సుధీర్, రష్మీలో బెస్ట్ ఎవరంటే? - చలాకీ చంటి ఇంటర్వ్యూ
జీవితంలో అలాంటి రోజు ఎవ్వడికీ రావొద్దు... సుధీర్, రష్మీలో బెస్ట్ ఎవరంటే? - చలాకీ చంటి ఇంటర్వ్యూ
Nara Lokesh: దావోస్ నుంచి తిరిగొచ్చిన నారా లోకేష్, గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం
దావోస్ నుంచి తిరిగొచ్చిన నారా లోకేష్, గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం
India Playing XI: జట్టులో రెండు మార్పులు.. షమీ తిరిగొస్తాడా..? అభిషేక్ ఆడకపోతే ఆ ప్లేయర్ బరిలోకి..
టీమిండియాలో రెండు మార్పులు.. షమీ తిరిగొస్తాడా..? అభిషేక్ ఆడకపోతే ఆ ప్లేయర్ బరిలోకి..
Embed widget