Chandrababu News: దేశంలో దావోస్ ట్రెండ్ సెట్ చేశా, మొదటిసారి నా నిర్ణయంతో అంతా షాక్: చంద్రబాబు
Andhra Pradesh News | భారతదేశంలో దావోస్ కు వెళ్లే ట్రెండ్ సెట్ చేసింది తానేనని, మొదటిసారి ఆ నిర్ణయంతో అంతా ఆశ్చర్యపోయారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Chandrababu about his Davot Tour | అమరావతి: తాను 1995లో సీఎం కాగా, 1997లో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. దేశంలో తొలిసారి దావోస్ కు వెళ్లి ఆర్థిక సదస్సులో పాల్గొన్నది తామే అన్నారు. గతంలో ఐటీ గురించి మాట్లాడితే.. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగొచ్చిన సందర్భంగా పర్యటన వివరాలను సీఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
1991లో ఆర్థిక సంస్కరణలతో మార్పు మొదలైంది. దేశం నుంచి తొలిసారిగా దావోస్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది నేనే. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ నుంచి వచ్చామని దావోస్‌లో చెబితే ఏ హైదరాబాద్, పాకిస్తాన్‌లో ఉందా అని అడిగేవారు. మేం ఏపీలోని హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్పాం. దావోస్‌కు వెళ్లాలంటే నాయకులు ఎంతో బెరుకుగా ఉండేవారు. నాతో ఎవరూ వచ్చేవాళ్లు కాదు. తరువాత ఎస్ఎం కృష్ణ వచ్చి నాతో పోటీ పడేవారు. బెంగళూరు వర్సెస్ హైదరాబాద్‌గా పోటీ తయారైంది. ఓ కాన్సెప్ట్‌తో కష్టపడితే హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
అమరావతి కొత్త బ్రాండ్..
గతంలో హైదరాబాద్‌ను ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీ సీఎంగా అమరావతి అనే కొత్త బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాం. 27 ముఖాముఖీ మీటింగ్స్ లో పాల్గొంటూనే, నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు, 3 కాంగ్రెస్ సమావేశాలు, ఒక యూఎన్ హాబిటెట్ సమావేశం జరిగింది. కాంగ్రెస్ సెషన్ లో ఎనర్జీ ట్రాన్సిషన్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఏఐ, గ్రీన్ ఎనర్జీ మీద ఫోకస్ పెట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలతో కలిసి ఇన్వెస్టర్స్‌కు మన దగ్గర ఉన్న అనుకూలత, ప్రభుత్వ సహకారం తెలిపాం. గతంలో ఐటీ గురించి మాట్లాడితే.. ఇప్పుడు హ్యూమన్ మెషిన్ కొలాబరేషన్ అన్ లాకింగ్ మీద ఫోకస్ చేశాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, మానుఫ్యాక్చరింగ్ లో గ్రీన్ మెథడ్ తీసుకురావడం. జాబ్ అడగడం కాదు, మనం జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. మాతృదేశానికి సేవ చేయాలంటే ఇక్కడి పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహదం చేయాలి. ఎంఎస్‌ఎంఈలతో యువతకు ఉద్యోగాలు వస్తాయి.
విశాఖలో గూగుల్ ఏర్పాటు
విశాఖపట్నంలో దిగ్గజ సంస్థ గూగుల్ ఏర్పాటు గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. మరోవైపు టీసీఎస్ సైతం సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గ్రీన్ ఎనర్జీని దావోస్ వేదికగా ప్రమోట్ చేశాం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీకి అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించాం. ఏపీలో అభివృద్ధి కోసం మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారం అందించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కోరాం. ప్రపంచ పటంలో అమరావతి చేరేలా చేస్తాం. తెలుగు వారు 2047 నాటికి ప్రపంచంలో అత్యంత ప్రభావిత వ్యక్తులుగా ఉంటారు. దావోస్ లో జరిపిన చర్చలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగా దావోస్ పర్యటనపై దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ తో పాటు ఏఐ, మేషిన్ లెర్నింగ్ లాంటి కీలక అంశాలపై దావోస్ లో చర్చించామని చంద్రబాబు తెలిపారు.
జీడీపీలో చైనాతో పోటీ
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2028 తరువాత చైనా జీడీపీని భారత్ అధిగమించే ఛాన్స్ ఉంది. నకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్, రామాయపట్నంలో రూ.95వేలకోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను బీపీసీఎల్ ఏర్పాటు చేయనుంది. దాదాపు 2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుందని చంద్రబాబు పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

