Aghori controversy: అమ్మాయిని ఎత్తుకెళ్లిన అఘోరి - పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
Crime News: అఘోరిని అంటూ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న వ్యక్తి ఓ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.

Mangalagiri: అఘోరినంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న వ్యక్తి మంగళగిరిలో ఓ అమ్మాయిని తీసుకెళ్లిపోవడం సంచలనంగా మారింది. మాయమాటలు చెప్పి మా అమ్మాయిని అఘోరి వశపరుచుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో అఘోరీ మంగళగిరి వచ్చిన సమయంలో బిటెక్ విద్యార్థినిని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత మంగళగిరి కి అఘోరి రాకపోకలు కొనసాగాయి. తాజాగా తాను అఘోరీగా మారటానికి హైదరాబాద్ వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయింది విద్యార్థి. అయితే తన కూతుర్ని మాయమాటలు చెప్పి అఘోరి తీసుకువెళ్లిందని తల్లిదండ్రులు పిర్యాదు చేశారు.
శ్రీవర్షిణి అనే ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులంతా ఒత్తిడి చేసినా శ్రీవర్షిణి ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను అఘోరీ నుంచి విడిపించాలని తల్లి దండ్రులు కోరారు. విచిత్రంగా శ్రీ వర్షిణి అన్న విష్ణు కూడా విచిత్రంగా స్పందించారు. లేడీ అఘోరీ తనను కూడా సెక్సువల్‌గా టార్చర్ పెట్టిందని.. నా మీద దాడి చేసిందని ఆరోపించారు. నా చెంపలు కొరికింది! బుగ్గలు నిమిరింది! లైంగికంగా వేధించిందని మీడియా ముందు ఆరోపణలు చేశాడు. ఈ వ్యవహారంతో అఘోరి తీరు మరోసారి వివాదాస్పదమయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

