అన్వేషించండి

Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం

Rayavaram Deputy Tahsildar Love Marriage | రాయవరం డిప్యూటీ తహసీల్దార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యాపారిని వధువు సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

Honour Killing in Konaseema | మండపేట: ఏపీలో మరో పరువు హత్య కలకలం రేపింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో, ఒక వ్యక్తిని అతని భార్య సోదరులే దారుణంగా హత్య చేశారు. మండపేట మండలం ద్వారపూడి శివారు ప్రాంతమైన వేములపల్లిలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లికి చెందిన పీవీవీ సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ క్లాస్‌మేట్స్ కావడంతో గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు గురువారం ఉదయం అన్నవరంలో వివాహం చేసుకుని, అనంతరం వేములపల్లిలోని సూర్యప్రకాశ్‌ ఇంటికి చేరుకున్నారు.

పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్‌, గిరిబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఎలాగైనా సరే బావ సూర్యప్రకాశ్ ను చంపాలని ప్లాన్ చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సూర్యప్రకాశ్‌ ఇంటికి వెళ్లిన భార్య సోదరులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరూ కలిసి బండరాయితో ఆయన ముఖంపై బలంగా బాదడంతో తీవ్ర రక్రస్త్రావమై సూర్యప్రకాశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు నిందితులు చంద్రపాల్, గిరిబాబులను పట్టుకుని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. మండపేట సీఐ, ఎస్సై ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు చంద్రపాల్‌, గిరిబాబులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Sandigdham: విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
విడుదలకు 'సందిగ్ధం'... క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరున్నారో చూశారా?
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Hyundai Verna 2026 వెర్షన్ వచ్చేసింది - కొత్త డిజైన్, అదనపు సేఫ్టీ ఫీచర్లు
2026 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Embed widget