Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు
Betting Apps Promotion Case:: ఏ పాపం తనకు తెలియదని అంతా విష్ణు ప్రియ చెబితే చేశానని రీతూ చౌదరి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇద్దర్నీ మరోసారి విచారణకు పిలిచారు ఖాకీలు.

Betting Apps Promotion Case:: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పోలీసులు దాదాపు పది గంటలకుపైగా విచారించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న రీతూ చౌదరి కూడా విచారణకు హాజరైంది. ఆమెను దాదాపు ఐదు గంటలకుపైగా విచారించారు పోలీసులు. మార్చి 25న విచారణకు రావాలని పోలీసులు వాళ్లిద్దరికీ సమాచారం అందించారు.
ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు వచ్చిన విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ముందుగా వాళ్లఫోన్లు సీజ్ చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంశంపై ప్రశ్నలు సంధించారు. ఈ విచారణలో రీతూ చౌదరి విష్ణు ప్రియను బుక్ చేసినట్టును తెలుస్తోంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయం తనకు విష్ణుప్రియే చెప్పినట్టు రీతూ అంగీకరించింది. అసలు ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా వీడియోలు చేయాలో కూడా ఆమె ట్రైనింగ్ ఇచ్చినట్టు పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన విషయాలను రికార్డింగ్ చేసుకున్న పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. మార్చి 25 మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు.
ఈ కేసులో యాంకర్ విష్ణు ప్రియను మాత్రం చాలా గ్రిల్ చేసినట్టు చెబుతున్నారు. ఎక్కడ మొదలైందని డబ్బులు ఎలా చేరవేశారు. ఎంతెంత వసూలు చేశారు. దీని వెనుకున్న గ్రూప్స్ సంగతేంటీ... ఎవరు సంప్రదించారు. కంటెంట్ ఇచ్చింది ఎవరు ఇలా చాలా విషయాలపై గుచ్చి గుచ్చి అడిగారు. ఈమె ఎవరెవర్నీ ఇందులోకి లాగారనే విషయాలపై కూడా ఆరా తీశారు.
విష్ణు ప్రియ విచారణలో చాలా విషయాలు తెలిసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. తనకు బెట్టింగ్ యాప్స్ నుంచి భారీగానే డబ్బులు వచ్చాయని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె బ్యాంకు స్టేట్మెంట్‌ను కూడా వచ్చినట్టు తీసుకురావాలని పోలీసులు ముందుగానే చెప్పారు. అందులో పెద్ద పెద్ద లావాదేవీల గురించి ప్రశ్నలు సంధించారు.
ఇది నేరం అన్న సంగతి తనకు తెలియదని డబ్బులు వస్తున్నందున చేసినట్టు చెప్పారు. తప్పు అని తెలిసిన తర్వాత చేయడం మానేశానని ఒప్పుకున్నారు. ఇలాంటి జోలికి వెళ్లబోనని పోలీసులకు తెలియజేశారు. ఈ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు తనకు నిమిషానికి 90 వేలు ఆఫర్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా చాలా యాప్స్‌కు ప్రమోట్ చేసినట్టు తెలిపారు.
విష్ణు ప్రియ చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఇంకా దీనిపై విచారించాల్సి ఉందని అందుకే మళ్లీ రావాలని చెప్పారు. మార్చి 25న విచారణకు రావాల్సిందిగా ఆమెకు సమాచారం ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

