Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
జస్ట్ ఓ సారి ఊహించింది. ఐపీఎల్ 2026 వేలంలో ఓ టీమ్ ఉంది. దాని దగ్గర కేవలం 2 కోట్ల 75లక్షల రూపాయల పర్స్ ఉంది. అలాంటిది కోటి రూపాయల బేస్ ప్రైస్ ఉన్న ఓ ఆటగాడికి అదే కోటి రూపాయలకే కొనేసుకుంటే ఏం అనుమానమే రావట్లేదా...పైగా ఏ ఒక్క టీమూ అతని కోసం పోటీయే పడలేదు. పైగా తను ఫామ్ లో లేడా అంటే ఇప్పుడు జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ లో రెండో టీ20 లో 90 పరుగులు చేశాడు. పైగా తనో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్. ఎస్ ఈ ఎపిసోడ్ అంతా నిజంగా జరిగింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో సఫారీ స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ను అతని బేస్ ప్రైజ్ అయిన కోటి రూపాయలకే పోటీనే లేకుండా రెండు కోట్లు మాత్రమే పర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ మినీ వేలానికి కొద్ది రోజుల ముందే రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఉన్న తన ధరను డికాక్ ఎందుకో తెలియదు కోటి రూపాయలకు తగ్గించుకున్నాడు. ఇదంతా చూస్తుంటే తనను వేలంలో పాడుకోవాలని ముంబై ముందే ఫిక్స్ అయింది. పైగా ఆ విషయాన్ని మిగిలిన టీమ్స్ తో కూడా చర్చించిందని క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. మిగిలిన టీమ్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటాయి వాళ్లు కూడా పోటీ పడొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎంత లేదన్నా ఐపీఎల్ ఓ వ్యాపారం. ముంబై లాంటి పెద్ద పర్స్ లేని జట్టు ప్రతీ ప్లేయర్ కి వేలానికి వచ్చి తన ప్రైస్ ను ఊరికే పెంచి చిరాకు తెప్పించొచ్చు. ఫలితంగా అది మిగిలిన జట్ల పర్స్ పై ప్రభావం చూపిస్తుంది. వాళ్లు ప్లేయర్ కోసం ఎక్కువ రేట్ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇలా డికాక్ లాంటి సింగిల్ ప్లేయర్ కోసం వాళ్లు వాళ్లు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని మాత్రం అర్థం చేసుకోవాలి.





















