Oscars 2026 - Homebound: ఆస్కార్స్ 2026 బరిలో జాన్వీ కపూర్ సినిమా... టాప్ 15లో ఇండియన్ ఫిల్మ్ 'హోమ్‌బౌండ్'
Homebound selected for Oscars: ఆస్కార్ 2026 బరిలో ఇండియన్ సినిమా 'హోమ్ బౌండ్' మరో అడుగు ముందుకు వేసింది. 98వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయింది.

దర్శకుడు నీరజ్ ఘాయవాన్ రూపొందించిన 'హోమ్‌బౌండ్' సినిమా 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేఠ్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది విన్న తర్వాత చిత్ర నిర్మాత కరణ్ జోహార్ భావోద్వేగానికి గురయ్యారు. సంతోషం వ్యక్తం చేశారు.
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం నాడు 12 విభాగాలలో షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలను, కళాకారులు లేదా సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించింది. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 15 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. తర్వాత వీటిలో ఐదు ఎంపిక చేస్తారు.
షార్ట్ లిస్ట్ చేయబడిన సినిమాలు ఇవే
'హోమ్‌బౌండ్'తో పాటు అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అర్జెంటీనాకు చెందిన 'బెలీన్', బ్రెజిల్ నుండి 'ది సీక్రెట్ ఏజెంట్', ఫ్రాన్స్ నుండి 'ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జర్మనీ నుండి 'సౌండ్ ఆఫ్ ఫాలింగ్', ఇరాక్ నుండి 'ది ప్రెసిడెంట్స్ కేక్', జపాన్ నుండి 'కొకుహో', జోర్డాన్ నుండి 'ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యు', నార్వే నుండి 'సెంటిమెంటల్ వ్యాల్యూ', పాలస్తీనా నుండి 'పాలస్తీనా 36', దక్షిణ కొరియా నుండి 'నో అదర్ ఛాయిస్', స్పెయిన్ నుండి 'సిరాత్', స్విట్జర్లాండ్ నుండి 'లేట్ షిఫ్ట్', తైవాన్ నుండి 'లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్', ట్యునీషియా నుండి 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' ఉన్నాయి.
రాబోయే రోజుల్లో షార్ట్ లిస్ట్ విభాగంలో తుది నామినేషన్లు ఉంటాయి. తుది నామినేషన్లను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. ఆస్కార్ 2026లో హాస్య నటుడు కోనన్ ఓబ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఆస్కార్ అవార్డులు మార్చి 15న జరగనున్నాయి.
థాంక్స్ చెప్పిన కరణ్ జోహార్!
ఆస్కార్‌కు 'హోమ్‌బౌండ్' షార్ట్ లిస్ట్ అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు కరణ్ జోహార్. 'హోమ్‌బౌండ్ ప్రయాణం ఎంత గర్వంగా, సంతోషంగా ఉందో నేను ఎలా చెప్పగలను? ఈ చిత్రాన్ని ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చూడటం మా అందరికీ గర్వంగా ఉంది. నీరజ్... మా అందరి కలలను నిజం చేసినందుకు ధన్యవాదాలు. కాన్స్ నుండి ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడం వరకు ఇది అద్భుతమైన ప్రయాణం. నటీనటులకు నా ప్రేమను అందిస్తున్నా. 'హోమ్‌బౌండ్' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది'' అని పేర్కొన్నారు.
View this post on Instagram
View this post on Instagram
కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ మూవీస్ సైతం సోషల్ మీడియా 'హోమ్‌బౌండ్' షార్ట్ లిస్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేసింది.
Also Read:Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!





















