Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Jai Akhanda Update: అఖండను ద్వారక క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. 'అఖండ 2 తాండవం'ను 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మూడో సీక్వెల్ మరొకరు నిర్మిస్తారని తెలిసింది.

కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను తండోపతండాలుగా... అదీ ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల మీద రప్పించిన సినిమా 'అఖండ'. కొవిడ్ 19 మహమ్మారి తరువాత థియేటర్లకు మళ్ళీ ప్రేక్షకులు వస్తారని మన తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర భాషల చిత్రసీమలకు భరోసా ఇచ్చిన సినిమా అది. దానిని ద్వారక క్రియేషన్స్ పతాకం మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అయితే ఆ సినిమా సీక్వెల్ 'అఖండ 2 తాండవం'ను 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సీక్వెల్ మరొకరు నిర్మిస్తారని తెలిసింది.
జై అఖండ నిర్మాతలు ఎవరు?
ప్రొడ్యూసర్ల మార్పు వెనుక కారణం?
'అఖండ 2 తాండవం' విడుదలకు ముందు సీక్వెల్ గురించి దర్శకుడు బోయపాటి శ్రీను ఒక హింట్ ఇచ్చారు. సినిమా ఆర్ఆర్ (నేపథ్య సంగీతం), సౌండ్ మిక్సింగ్ పనులు పూర్తి అయ్యాక సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి దిగిన ఫోటోను 14 రీల్స్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. అందులో 'జై అఖండ' అని కనిపించింది.
'అఖండ 2 తాండవం' థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు సైతం సీక్వెల్ 'జై అఖండ' గురించి క్లారిటీ వచ్చింది. తాండవం పూర్తి అయ్యాక మూడో సీక్వెల్ టైటిల్ వేశారు బోయపాటి. భవిష్యత్తులో ఆ సినిమాను కొత్త నిర్మాతలతో రూపొందించే అవకాశం ఉందని ఫిలిం నగర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: Rakul Preet Singh: డాక్టర్ మీద రకుల్ ఆగ్రహం... ప్లాస్టిక్ సర్జరీ కాంట్రవర్సీపై క్లారిటీ
'అఖండ'ను ద్వారక క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తే... ఆ తరువాత సీక్వెల్ 'అఖండ 2 తాండవం'ను 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయం సాధించింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. చిత్ర నిర్మాణంలో 14 రీల్స్ ప్లస్ అధినేతలు రాజీ పడలేదు. అయితే... విడుదలకు ముందు జరిగిన పరిణామాల పట్ల కథానాయకుడు - గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను అసంతృప్తికి గురి అయ్యారని తెలిసింది.
ఇటీవల నిర్వహించిన 'అఖండ 2 తాండవం' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో నిర్మాతల గురించి బాలకృష్ణ లేదా బోయపాటి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అదే సమయంలో డిసెంబర్ 5న వాయిదా పడిన సినిమాను 12ను విడుదల చేయడానికి సహకరించిన 'దిల్' రాజు, 'మ్యాంగో' రామ్, శ్రీధర్, డాక్టర్ సురేంద్ర గురించి మాట్లాడారు. విడుదలకు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో 'జై అఖండ'ను 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదని తెలిసింది. 'అఖండ 2 తాండవం' పాన్ ఇండియా సక్సెస్ సాధించిన నేపథ్యంలో 'జై అఖండ' ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ నిర్మాతలు ఎవరు? అనేది సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు క్లారిటీ వస్తుంది.




















