'అఖండ 2' నైజాం థియేట్రికల్ రైట్స్ వేల్యూ రూ. 27 కోట్లు అని తెలిసింది.
రాయలసీమ (సీడెడ్) ఏరియా నుంచి మంచి అమౌంట్ వచ్చింది. అక్కడ రూ. 24 కోట్లకు అమ్మారు.
ఏపీలో విశాఖ (ఉత్తరాంధ్ర) రూ. 13.50, గుంటూరు రూ. 9.50, ఈస్ట్ గోదావరి రూ. 8.25, కృష్ణా రూ. 7, వెస్ట్ గోదావరి రూ. 6.50, నెల్లూరు రూ. 4.40 కోట్లకు అమ్మారు.
తెలుగు రాష్ట్రాలు దాటితే... రెస్టాఫ్ ఇండియా రైట్స్ కేవలం రూ. 8 కోట్లకు మాత్రమే ఇచ్చారు.
'అఖండ 2' నిర్మాతలకు ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 15 కోట్లు వచ్చాయి.
'అఖండ 2' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 123.15 కోట్లు.
అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు నిర్మాతలకు లాభాలు రావాలంటే మినిమమ్ రూ. 125 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
డిస్ట్రిబ్యూటర్లకు 125 కోట్ల షేర్ రావాలంటే... మినిమమ్ 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి.