తగలబెట్టేద్దామా... 'వారణాసి' టైటిల్‌ లాంచ్‌లో ప్రియాంక చోప్రా తెలుగు సూపరంతే

Published by: Satya Pulagam

సూపర్ స్టార్ మహేష్ బాబు - ప్రియాంకా చోప్రా... రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరికీ 'వారణాసి' మొదటి సినిమా.

'వారణాసి'లో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. టైటిల్ రివీల్‌ ఈవెంట్‌కు వీళ్లంతా అటెండ్ అయ్యారు.

బాలీవుడ్... ఆ మాటకు వస్తే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ప్రియాంకా చోప్రాను దేశీ గర్ల్ అంటుంది. డ్రసింగ్‌లో దేశీ గర్ల్ వైబ్స్ చూపించారు.

'వారణాసి' కంప్లీట్ అయ్యేసరికి తెలుగులో మాట్లాడతానని, స్పీచ్ ఇస్తానని ప్రియాంకా చోప్రా చెప్పారు. శాంపిల్ కోసం అన్నట్టు రెండు తెలుగు డైలాగులు చెప్పారు.

తగలబెట్టేద్దామా... 'వారణాసి' స్టేజిపై ప్రియాంకా చోప్రా చెప్పిన మొదటి డైలాగ్ ఇది. దీనికి ఈవెంట్ అంతా దద్దరిల్లింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'దూకుడు'లో డైలాగ్ కూడా చెప్పారు ప్రియాంక.

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా దూసుకు వెళ్తా - ఇదీ ప్రియాంకా చోప్రా చెప్పిన రెండో డైలాగ్.

'వారణాసి' విడుదల అయ్యేది 2027 వేసవిలో. ప్రియాంక పట్టుదల చూస్తే... అప్పటికి తెలుగు నేర్చుకునేలా ఉన్నారు.

'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా ఫోటోలు