ఓటీటీ రైట్స్ రూ. 14 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మడం ద్వారా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్ర నిర్మాతలకు 21 కోట్లు వచ్చాయి.
'ది గర్ల్ ఫ్రెండ్' నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ. 7 కోట్లకు అమ్మారు. రష్మిక క్రేజ్ వల్ల అంత మొత్తం వచ్చిందని చెప్పాలి. ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఇది హయ్యస్ట్ అమౌంట్.
ఆంధ్రలో అన్ని ఏరియాలు కలిపి రూ. 5 కోట్లకు అమ్ముడు అయ్యాయి. అక్కడ నుంచి సైతం మంచి అమౌంట్ వచ్చింది.
సీడెడ్ (రాయలసీమ)లో మాస్ మూవీలకు ఎక్కువ రేటు వస్తుంది. అటువంటి ఏరియా నుంచి 'ది గర్ల్ ఫ్రెండ్'కు రూ. 1.26 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు.
ఏపీ & తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 13.26 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్ రూ. 2 కోట్లు, నార్త్ ఇండియా నుంచి మరో రూ. 2 కోట్లు, కర్ణాటక - తమిళనాడు - కేరళ నుంచి రూ. 2 కోట్లు... తెలుగు రాష్ట్రాలు మినహా రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది 'ది గర్ల్ ఫ్రెండ్'.
'ది గర్ల్ ఫ్రెండ్' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ రూ. 20 కోట్లు. థియేటర్స్ నుంచి మినిమమ్ రూ. 21 కోట్ల షేర్ రాబడితే ప్రాఫిట్ జోన్ లోకి వెళుతుంది. ఎలా లేదన్నా 35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాలి.