'మసూద'తో తిరువీర్ హీరోగా మారారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఆ సినిమాకు మంచి విజయం దక్కింది. తర్వాత 'పరేషాన్', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సైతం డీసెంట్ హిట్స్ అయ్యాయి.
సినిమాలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో తిరువీర్ ఎక్కువగా మీడియాలో కనిపించరు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలుసా? ఆయనకు పెళ్లి అయ్యిందని తెలుసా?
నవంబర్ 17, 2023లో తిరువీర్ నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో ఆ వేడుక నిర్వహించారు.
ఏప్రిల్ 21, 2024... తిరువీర్ పెళ్లి చేసుకున్న రోజు. ఇండస్ట్రీలో కొంత మంది స్టార్స్, సెలబ్రిటీలతో పాటు తిరువీర్ సన్నిహితులు ఆ పెళ్లికి హాజరయ్యారు.
తిరువీర్ భార్య పేరు కల్పనా. ఆవిడ ఒక ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు సమాచారం.
పెళ్లి తర్వాత తిరువీర్ - కల్పన జంట కొత్త ఇంటిలోకి అడుగు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో సొంత ఇంటి గృహ ప్రవేశం జరిగింది.
కల్పన, తిరువీర్ పెళ్లి ఫోటోలు ఇవి. వాళ్ళిద్దరిదీ అనోన్య దాంపత్యం. ఎప్పుడూ ఈ జంట ఇలాగే సంతోషంగా ఉండాలని పెద్దలు దీవించండి.