సుధీర్ బాబును చాలా మంది సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా చూస్తారు. అయితే మహేష్ బావ కావడానికి ముందు ఆయన స్టేట్ లెవల్ స్టార్.
సుధీర్ బాబు హీరో మాత్రమే కాదు... ఆయన మంచి బాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆంధ్రప్రదేశ్ తరఫున స్టేట్ లెవల్ లో ఆడారు.
అవును... ప్రముఖ బాడ్మింటన్ కోచ్, ఒకప్పటి ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కు బాడ్మింటన్ లో డబుల్స్ పార్ట్నర్ సుధీర్ బాబు.
బాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్ బాబు. మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాకూ తనను తాను మలుచుకుంటూ వస్తున్నారు.
సుధీర్ బాబుది అథ్లెటిక్ బాడీ. బాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ముందు నుంచి ఫిట్నెస్ మైంటైన్ చేసేవారు. ఆయన సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్స్ చేశారు. కొన్ని సినిమాలకు అవి హెల్ప్ అయ్యాయి.
బాడ్మింటన్ క్రీడలో తన సహచరుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేయడానికి సుధీర్ బాబు ప్లాన్ చేశారు. కానీ, అది సెట్స్ మీదకు వెళ్ళలేదు.
సినిమాల్లో జయాపజయాలు సహజం. అవి పక్కన పెడితే... హీరోగా తనకు అంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు.
సుధీర్ బాబు కుమారులు - మహేష్ బాబు మేనల్లుళ్లు దర్శన్, చరిత్ మానస్ తెరపై అడుగు పెడుతున్నారు. ప్రభాస్ 'ఫౌజీ'లో చిన్న కొడుకు నటించగా... 'భలే భలే మగాడివోయ్'లో పెద్ద కొడుకు నటించాడు.
సుధీర్ బాబుగా ప్రేక్షకులు అందరికీ తెలిసిన ఈ హీరో ఇంటి పేరు ఏమిటో తెలుసా? పోసాని! పోసాని అంటే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేది రచయితా పోసాని కృష్ణమురళి. సుధీర్ బాబు ఇంటి పేరుతో కాకుండా తన పేరుతో పాపులర్ అయ్యారు.