తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'జగతి మేడమ్' అని చెబితే వెంటనే జ్యోతి పూర్వాజ్ (Jyothi Poorvaj Popular Serial)ను గుర్తు పడతారు. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో చేసిన పాత్ర ఆమెకు అంత గుర్తింపు తెచ్చింది.
జగతి మేడమ్ అసలు పేరు ఏమిటో తెలుసా? జయశ్రీ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... జయశ్రీ రాయ్. అయితే... పేరును జ్యోతిగా మార్చుకున్నారు. ఆ వెనుక భర్త పేరును యాడ్ చేశారు.
Jyothi Poorvaj First Husband Name: జ్యోతి పూర్వాజ్... సారీ జయశ్రీ రాయ్ మొదటి వివాహం ఆమెకు 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు జరిగింది. ఆమె భర్త పేరు పద్మనాభ్.
జ్యోతి, పద్మనాభ్ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయి వయసు ఇప్పుడు 10 ఏళ్ళ కంటే ఎక్కువ అని చూసిన వాళ్ళు చెబుతున్నారు.
పద్మనాభ్, జ్యోతి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు ఒంటరి జీవితం గడిపారు. ఆ తర్వాత సినిమా వల్ల సుకు (సురేష్ కుమార్)తో కోసం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసి పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది.
విడాకుల తర్వాత నటిగా జయశ్రీ రాయ్ ప్రయాణం మొదలైంది. తొలుత కన్నడ సీరియల్స్ చేశారు. ఆ తర్వాత తెలుగు సీరియల్స్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.
సుకుతో వివాహం తర్వాత ఆయన పేరులోని 'పూర్వాజ్'ను తన పేరు చివర నేర్చుకుని 'జ్యోతి పూర్వాజ్'గా పేరు మార్చుకున్నారు ఒకప్పటి బుల్లితెర నటి జయశ్రీ రాయ్.
భర్త సుకు పూర్వాజ్ దర్శకత్వంలో జ్యోతి రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి... ఏ మాస్టర్ పీస్. రెండోది... కిల్లర్. 'కిల్లర్'లో జ్యోతి మెయిన్ లీడ్. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది.
'మాస్టర్ పీస్', 'కిల్లర్' తర్వాత వరుస సినిమాలు చేయాలని జ్యోతి పూర్వాజ్ రెడీ అయ్యారు. పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి ఆమె రెడీగా ఉన్నారట.