Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్ 2-1 తో సౌత్ ఆఫ్రికాపై ఆధిక్యంలో ఉంది. రెండో టి20లో ఘోరంగా ఓడిన భారత జట్టు మూడో టి20తో బౌన్స్ బ్యాక్ అయ్యింది.
ఇక మూడవ టీ20 లోను వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ( Shubman Gill ) ఆకట్టుకోలేకపోయాడు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలం అయినా కూడా మూడవ మ్యాచ్ కు బౌన్స్ బ్యాక్ అవుతాడని అందరు ఆశించారు. కానీ ఆలా జరగలేదు. మంచి స్టార్ట్ వచ్చినా కూడా శుబ్మన్ గిల్ పరుగులు చేయడంలో విఫలం అయ్యాడు. ఒకపక్కన అభిషేక్ శర్మ వరుసగా బౌండరీలతో చెలగెరిపోతుంటే.. గిల్ మాత్రం ప్రతి బాల్ ను ఆచితూచి ఆడుతూ ఇబ్బంది పడ్డాడు.
అయితే ఈ మ్యాచ్ లో కూడా గిల్ డక్ అవుట్ ఐయేవాడు. రెండో బాల్ కు ఎల్బీ అయ్యాడు. అంపైర్ అవుటివ్వగా.. రివ్యూలో బాల్ బ్యాట్‌కు తాకినట్లుగా తేలింది. దాంతో మళ్ళి నాట్ అవుట్ ఇచ్చారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2026 ( T20 World Cup 2026 ) కు ముందు వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇలా ఫార్మ్ కొలిపోవడం అనేది ఫ్యాన్స్ తోపాటు క్రికెట్ నిపుణులను కూడా కలవర పెడుతున్న విషయం. వరల్డ్ కప్ లో రాణించాలంటే గిల్ మంచి ఫార్మ్ ను సంపాదించుకోవాలి.





















