అన్వేషించండి

Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే

Strait Of Hormuz | హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కాకుండా విదేశాల నియంత్రణ ఎందుకు కష్టంగా మారుతోంది. యూరోపియన్ దేశాలు ఎందుకు రాజీ మంత్రాన్ని పాటిస్తున్నాయి.

Iran Israel conflict | హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కాకుండా విదేశాల నియంత్రణ ఎందుకు కష్టం, యూరోపియన్ దేశాలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయి? అని చర్చ మొదలైంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ భౌగోళిక నియంత్రణ, దాని మిస్సైల్  సామర్థ్యం విదేశీ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. 21 మైళ్ల వెడల్పు ఉన్న ఈ ఇరుకైన మార్గంలో నౌకల సీజ్, జామింగ్ భయంతో యూరోపియన్ దేశాలు వెనక్కి తగ్గాల్సి వస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముడి చమురుపై ఆధారపడి ఉంటుంది. అందులో నాలుగో వంతు హర్ముజ్ జలసంధి (Hormuz Strait) అత్యంత ఇరుకైన, ప్రమాదకరమైన మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ సముద్ర మార్గంలో మరోసారి మిస్సైల్ దాడులు, బాంబు దాడుల భయాలను పెంచుతున్నాయి. ఈ జలసంధి ఎంత ఇరుకైనదంటే, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నౌకాదళాలు సైతం ఇక్కడ తాము అసురక్షితం అని భావిస్తాయి. గత కొంత కాలంగా యూరోపియన్ దేశాలు ఈ ప్రాంతం నుండి వెనక్కి తగ్గడం, భద్రతా బాధ్యతల నుండి తప్పుకోవడానికి ప్రయత్నించడం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇది కేవలం సముద్ర మార్గం మాత్రమే కాదు, భౌగోళిక పరిస్థితులు, సైనిక వ్యూహాలు కలిసి ఏ దేశం నియంత్రణలోకి తీసుకోవడం దాదాపు అసాధ్యం చేస్తాయి. 

విదేశీ నౌకాదళాలకు ఇక్కడ పట్టు ఒక పీడకల?
హర్ముజ్ జలసంధి భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి. దీని వెడల్పు కేవలం 21 మైళ్లు మాత్రమే. నౌకల రాకపోకల కోసం సురక్షితమైన 'షిప్పింగ్ లేన్' దీనికంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఇరుకైన పరిస్థితి వల్ల ఇరాన్‌కు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే సుదీర్ఘ తీరప్రాంతం ఈ మొత్తం మార్గానికి సమాంతరంగా ఉంటుంది.

ఇరాన్ తన తీరాలలో, హర్ముజ్ జలసంధి, కేశమ్, లారక్ వంటి ముఖ్యమైన ద్వీపాలలో మోడ్రన్ మిస్సైల్ సిస్టమ్స్  మోహరించింది. ఏ దేశానికైనా ఇక్కడ నియంత్రణ సాధించడం కష్టం. ఎందుకంటే ఇక్కడ వార్ రూల్స్ చెల్లుబాటు కావడం తక్కువే. పెద్ద ఫైటర్ జెట్స్, యుద్ధనౌకలు తమ బలాన్ని ప్రదర్శించడానికి బదులు ఇరాన్ కు చెందిన ఫాస్టెస్ట్ మిస్సైల్ బోట్స్‌కు ఈజీ టార్గెట్ అవుతాయి. 

ఇరాన్ సైనిక వ్యూహం, యుద్ధ ముప్పు
ఇరాన్ ఈ ప్రాంతంలో తన అసమాన యుద్ధ (Asymmetric Warfare) సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తుంది. వారి వద్ద పెద్ద నేవీ దళం కంటే, మిస్సైల్స్, టార్పెడోలతో కూడిన వందలాది చిన్న పడవలు ఉన్నాయి. ఈ పడవలు గుంపులుగా ఒక్కసారిగా దాడి చేస్తే వీటిని ఎదుర్కోవడం భారీ నౌకలకు సైతం చాలా కష్టం. ఈ ఇరుకైన మార్గంలో సముద్రపు మందుపాతరలను (Mines) పరిచే తన సామర్థ్యాన్ని ఇరాన్ నిరూపించుకుంది. 

ఒకవేళ ఈ మార్గంలో ఒక్క మందుపాతర పేలినా, మొత్తం మార్గం ఇన్సూరెన్స్ ఖర్చు ఎంతగా పెరుగుతుందంటే, వాణిజ్య నౌకలు ఇక్కడికి రావడానికి భయపడతాయి. దీనితో పాటు ఇటీవల కాలంలో జీపీఎస్, నావిగేషన్ సిస్టమ్స్‌లో ఎలక్ట్రానిక్ జామింగ్ ఘటనలు నౌకల సురక్షిత ప్రయాణాన్ని కొత్త సవాలుగా మార్చాయి.

యూరప్ దేశాలు వెనక్కి తగ్గడానికి అసలు కారణం
తమ ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడే యూరప్ దేశాలు ఇక్కడ ప్రత్యక్ష సైనిక జోక్యానికి దూరంగా ఉంటున్నాయి. అందుకు అతిపెద్ద కారణం ఖర్చు, రిస్క్ మధ్య బ్యాలెన్స్ లేకపోవడం. అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏదైనా సైనిక కూటమిలో భాగమైతే, తమ వాణిజ్య నౌకలు ఇరాన్‌కు టార్గెట్ అవుతాయని యూరోపియన్ దేశాలు భయపడుతున్నాయి.

 ఇరాన్ ప్రతీకార చర్యలో భాగంగా గతంలో బ్రిటిష్, ఇతర యూరోపియన్ ట్యాంకర్లను జప్తు చేసింది. యూరోపియన్ దేశాలకు తమ నౌకలకు ప్రతిసారీ సైనిక ఎస్కార్ట్ ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని. అదే విధంగా నేరుగా యుద్ధాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి, ఇంధన సంక్షోభం
ప్రపంచంలోని సుమారు 20- 25 శాతం ముడి చమురు, ఎల్ఎన్‌జి హర్ముజ్ జలసంధి ద్వారా వెళుతుంది. ఇంత కీలకమైన ప్రాంతం కావడంతో హర్ముజ్ జలసంధి మార్గంలో ఎలాంటి దిగ్బంధనం లేదా ఘర్షణ జరగకూడదని యూరప్ దేశాలు కోరుకుంటున్నాయి. ఒకవేళ ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే, చమురు ధరలు రాత్రికి రాత్రే భారీగా పెరిగిపోయి. 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ ఇప్పటికే ఇంధన సంక్షోభంతో ఇబ్బంది పడుతోంది. అటువంటి పరిస్థితుల్లో వారు ఇరాన్‌ను రెచ్చగొట్టి కొత్త సమస్యను కొని తెచ్చుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే వారు సైనిక సత్తా చాటడానికి బదులుగా దౌత్య మార్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ నౌకాదళాలను ఈ డేంజర్ జోన్ నుంచి దూరంగా ఉంచి తమ వాణిజ్య కార్యకలాపాలు సజావుగా చేసుకుంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget