India vs New Zealand Final: శాంసన్, అభిషేక్, ఇషాన్ హాఫ్ సెంచరీలు.. న్యూజిలాండ్‌కు రికార్డ్ టార్గెట్
Ind vs NZ T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు భారత్ 256 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. నీషమ్ వేసిన ఓ ఓవర్లో మూడు వికెట్లు పడటంతో భారత్ పరుగుల వేగం చివర్లో తగ్గింది.
ఫైనల్లో భారత్ పరుగుల విధ్వంసం: 255/5
టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ సిక్సర్ల వర్షంతో విరుచుకుపడి పరుగుల వరద పారించారు. అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫాంలోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Breathtaking batting 🤩
— BCCI (@BCCI) March 8, 2026
A scintillating partnership of 1⃣0⃣5⃣(48) between Sanju Samson and Ishan Kishan in the #Final 👏🤝
Updates ▶️ https://t.co/5LXBod8bl1#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #INDvNZ | @IamSanjuSamson | @ishankishan51 pic.twitter.com/XucUaOOPpP
అభిషేక్ శర్మ (21 బంతుల్లో 52; 6x4 3x6) రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైనప్పటికీ, సంజూ శాంసన్ భారీ సిక్సర్లతో స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ సైతం కివీస్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. సంజూ శాంసన్ మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన సంజూ శాంసన్ (46 బంతుల్లో 89; 5x4 8x6) ఔటయ్యాడు. ప్యాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 54; 4x4 4x6) మళ్లీ పేలాడు. భారత టాపార్డర్ రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. చివర్లో శివం దుబే (8 బంతుల్లో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దాంతో టీ20 ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 255 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు ఉంచింది.
పవర్ ప్లేలో భారత్ విధ్వంసం!
అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఫైనల్లో అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, ఈ టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఫిన్ అలెన్, జాకబ్ బెథెల్ పేరిట ఉన్న 19 బంతుల రికార్డును అతను అధిగమించాడు.
4⃣, 6⃣, 6⃣, 4⃣, 4⃣ 🤯
— BCCI (@BCCI) March 8, 2026
How about that for a last-over finish by Shivam Dube 🔥🔥
Updates ▶️ https://t.co/5LXBod8bl1#TeamIndia | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @IamShivamDube pic.twitter.com/cdgrWhJAfn
మరోవైపు సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ పవర్ ప్లేలో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరిద్దరి ధాటికి భారత్ మొదటి 6 ఓవర్లలోనే 92 పరుగులు సాధించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాకుండా, టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనింగ్ జోడీకి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. జట్టు స్కోరు 98 వద్ద అభిషేక్ తొలి వికెట్‌గా వెనుదిరిగినా, తరువాత సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగడం, చివర్లో దూబే మెరుపులతో భారత్ భారీ స్కోరుకు (255/5) చేరుకుంది.
ఒకే ఓవర్లో 3 వికెట్లు..
16వ ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగింది. న్యూజిలాండ్ బౌలర్ జేమీ నీషమ్ ఆ ఓవర్లో తొలి బంతికి సంజూ శాంసన్ (89) ను ఔట్ చేశాడు. బౌండరీ వద్ద సబ్ స్టిట్యూట్ మెక్ కాంచీ క్యాచ్‌కు శాంసన్ నిరాశగా వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు 203. ఆ ఓవర్లో 5వ బంతికి ఇషాన్ కిషన్‌ను నీషమ్ పెవిలియన్ చేర్చాడు. మరుసటి బంతికే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను తొలి బంతికే ఔట్ చేసి టీమిండియాను ఊహించని దెబ్బకొట్టాడు. ఓ దశలో 280, 290 పరుగులు చేస్తుందనుకున్న టీమిండియా చివర్లో 250 మార్క్ చేరేందుకు ఆపసోపాలు పడింది. శివం దుబే చివరి ఓవర్లో ఫోర్లు, సిక్సర్లు బాదడంతో భారత్ 5 వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. చేరింది.
ట్రెండింగ్ వార్తలు




















