T20 World Cup Winner: టీ20 వరల్డ్ కప్ విజేత టీమిండియా.. ఫైనల్లో కివీస్ చిత్తు చిత్తు - సూర్య సేన సరికొత్త చరిత్ర
IND VS NZ T20 World Cup Final | నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకుంది.

IND vs NZ T20 World Cup 2026 Final Innings Highlights: అహ్మదాబాద్: టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం రాత్రి జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుపై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ బ్యాటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఏకంగా 96 పరుగుల తేడాతో నెగ్గిన సూర్యకుమార్ సేన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది.
ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (54) హాఫ్ సెంచరీ చేయగా, తరువాత కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (35 బంతుల్లో 43) వికెట్ పడకుండా ఆచితూచి ఆడాడు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రిత్ బుమ్రా వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ జాకబ్ డఫీ (3)ను ఔట్ చేయడంతో 19 ఓవర్లలో 159 పరుగులకే కివీస్ కథ ముగిసింది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🇮🇳#TeamIndia clinch a record 3️⃣rd ICC Men's #T20WorldCup title 🏆
— BCCI (@BCCI) March 8, 2026
Take. A. Bow 🫡#MenInBlue | #Final | #INDvNZ pic.twitter.com/nml1AZY5tK
చరిత్ర సృష్టించిన టీమిండియా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగిన పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో నెగ్గి వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ 20 వరల్డ్ కప్ చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2007లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాగా, ఇప్పటివరకూ విజేతగా నిలిచిన ఏ జట్టు కూడా తరువాత ఎడిషన్‌లో ట్రోఫీని దక్కించుకోలేదు. 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠపోరులో విజయం సాధించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. తాజా విజయంలో టీ20 వరల్డ్ కప్ 3 సార్లు నెగ్గిన తొలి జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది.
బ్యాటింగ్‌లో అదరగొట్టిన టాపార్డర్..
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 255/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కోరు. భారత్ తరపున సంజూ శాంసన్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. ఇక టోర్నమెంట్ మొత్తం విఫలమైన అభిషేక్ శర్మ కీలకమైన ఫైనల్లో ఫాంలోకి వచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ తరపున జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు.
భారత్ అద్భుత ఆరంభం
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 43 బంతుల్లోనే 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే 6 ఓవర్లలో 92 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. మరోవైపు 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ నాకౌట్ మ్యాచులోల ఫాస్టెస్ట్ హాఫ్ సెంరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. జాకబ్ బెథెల్, ఫిన్ అలెన్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును బద్ధలుకొట్టాడు. ఆ తర్వాత భారత బ్యాటర్లు వెనక్కి తిరిగి చూడలేదు. అనంతరం జట్టు రెండో వికెట్ 203 పరుగుల స్కోరు వద్ద పడింది. 89 పరుగులు చేసిన సంజూ శాంసన్ అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రెండో వికెట్‌కు 48 బంతుల్లో 105 పరుగులు జోడించారు.
ఆ తర్వాత పరుగుల వేగం కొంత తగ్గింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కానీ చివర్లో శివమ్ దూబే అద్భుతం చేస్తూ కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదుతూ 28 పరుగులు సాధించాడు.
కివీస్ బౌలర్లకు చుక్కలు
న్యూజిలాండ్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. ఫెర్గూసన్ 2 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. రచిన్ రవీంద్ర 2 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. రచిన్ ఒక వికెట్ తీశాడు. మిగిలిన వారిలో జాకబ్ డఫీ 3 ఓవర్లలో 42 పరుగులు, జేమ్స్ నీషమ్ 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చారు. కానీ నీషమ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. ఇక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు




















