India vs New zealand Final Toss: ఫైనల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే.. ప్లేయింగ్ 11 టీమ్స్
India vs New Zealand Final: డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా పటిష్ట న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడయంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుంది.

అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది. టాస్ నెగ్గిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఫైనల్‌లో విజయం సాధించి కప్పు నిలబెట్టుకోవాలిని డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా భావిస్తోంది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచ కప్ నెగ్గిన తొలి జట్టు అవుతుంది. 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ భారత్ కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిపాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం వచ్చింది. మరోవైపు తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. కివీస్ జట్టు కోల్ మెక్‌కాంచీ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు.
టీమిండియా ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ 11: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.
Presenting #TeamIndia's Playing XI for the #Final 🙌
— BCCI (@BCCI) March 8, 2026
Updates ▶️ https://t.co/5LXBod8bl1#T20WorldCup | #MenInBlue | #INDvNZ pic.twitter.com/FkOPQTAn5p
భారత్ నాలుగోసారి, న్యూజిలాండ్ రెండోసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నాయి. భారత్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒకసారి ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ ఒకే ఒక్కసారి ఫైనల్ ఆడినా.. టైటిల్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు కివీస్ జట్టు రెండోసారి ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. భారత్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించగా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టును మట్టికరిపించింది. ఇప్పటివరకూ టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై కివీస్ 3 సార్లు నెగ్గింది.
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలం. ఇక్కడ హై స్కోరింగ్ మ్యాచ్ జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఇది ఎర్ర మట్టి పిచ్, దీనిపై గడ్డి తక్కువగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఉన్న ఓటముల పరంపరను తిరగరాయడానికి భారత్‌కు ఇదే మంచి అవకాశం. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిలో ఛేజింగ్ చేయడం కష్టం, అదే విధంగా మంచు (Dew) ప్రభావం ఉండకపోవచ్చు.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో లైవ్ చూడవచ్చు. మొబైల్‌లో జియో హాట్‌స్టార్ (Jio hotStar) యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్ లైవ్ వీక్షించదచ్చు.
ట్రెండింగ్ వార్తలు

















