Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
టీ20లో టీమ్ ఇండియా తరపున కెప్టెన్ పగ్గాలు అందుకున్నతర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో ప్రదర్శించలేక పోతున్నాడు. ఒకప్పుడు సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వర్షం కురిపంచేవాడు. కానీ కెప్టెన్ అయినప్పటి నుంచి ఆలా జరగట్లేదు. కెప్టెన్ గా ఉండడమంటే కేవలం టాస్ వేయడానికి, బౌలర్ ను రొటేట్ చేయడానికి మాత్రమే కాదు అంటూ.. రన్స్ కూడా చేయాలంటూ మాజీ ప్లేయర్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుసగా తనపై వస్తున్న విమర్శలకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చాడు. తాను ఫామ్‌లో లేను అనేది కరెక్ట్ కాదని, కేవలం రన్స్ మాత్రమే రావడం లేదు అంటూ స్పష్టం చేశాడు.
“నిజం చెప్పాలంటే, నేను నెట్స్‌లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా చేతిలో ఉన్న ప్రతిదీ ప్రయత్నిస్తున్నాను. మ్యాచ్‌లో రన్స్ రావాల్సిన సమయం వస్తే అవి తప్పకుండా వస్తాయి. కానీ ఇప్పటికీ నేను రన్స్ కోసం వెతుకుతున్న స్టేజ్ లో ఉన్నాను. ఫామ్‌లో లేను అనడం సరైంది కాదు.. కేవలం రన్స్ రావడం లేదు అంతే” అని సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు.
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా మూడోసారి కూడా సూర్య విఫలమయ్యాడు. 2025 సంవత్సరం మొత్తంలో సూర్య పెద్దగా పెర్ఫర్మ్ చేయలేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.





















