అన్వేషించండి

YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

YCP: కూకట్ పల్లిలో వైసీపీ నేతల కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ప్రధాన కార్యదర్శి శ్యామలతో పాటు పలువురు ఎమ్మెల్యేల తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Kukatpalli YSRCP:  వైఎస్ఆర్‌సీపీ తెలంగాణలో రాజకీయాలు చేస్తోంది. అయితే తెలంగాణ మొత్తం కాదు.  హైదరాబాద్‌లోనే.  అంటే.. హైదరాబాద్ మొత్తం కూడా కాదు. కూకట్ పల్లిలో మాత్రమే .. ఇంకా చెప్పాలంటే.. కూకట్ పల్లిలో ఓ ఏరియాలో మాత్రమే వైసీపీ రాజకీయాలు చేస్తోంది. వైఎస్ఆర్ విగ్రహం ఉన్న చోట తరచూ ధర్నాలు చేస్తున్నారు.  సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే అక్కడ ధర్నాలు చేసేది.. సంతకాలు సేకరించేది తెలంగాణ రాజకీయాల కోసం కాదు.. ఏపీ రాజకీయాల గురించే. కాస్త విచిత్రంగా ఉన్నా వైసీపీ.. ఏపీ రాజకీయాలను హైదరాబాద్‌లో చేస్తోందని  అర్థం చేసుకోవచ్చు. 

పిన్నెల్లి అరెస్టుకు నిరసనగా కూకట్‌పల్లిలో శ్యామల ఆధ్వర్యంలో ధర్నా 

ఈ ఆదివారం  కేపీహెచ్‌బీలోని  వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ అధికార ప్రతినిధి షర్మిల, కారుమూరి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. మరికొంత మంది కలిసి ధర్నా చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని.. అన్యాయంగా జైలుకు పంపుతోందని .. వెంటనే విడుదల చేయాలని ఈ ధర్నా చేశారు.  పిన్నెల్లి అరెస్టుకు..కూకట్ పల్లికి సంబంధం లేదు కానీ.. వైసీపీ నేతలు అక్కడ ధర్నా చేసేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.        

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో సంతకాల సేకరణ           

అంతకు ముందే అదే ప్రాంతంలో ఏపీలో వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమాన్ని  నిర్వహించారు.  ఏపీలో  మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కోటి సంతకాలను వైసీపీ సేకరించింది.  ఏపీతో పాటు హైదరాబాద్ లోనూ ఈ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు.  అప్పుడే చాలా మంది ఏపీలో రాజకీయానికి తెలంగాణలో సంతకాలు సేకరించడం ఏమిటని సెటైర్లు వేశారు. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయడంతో మరోసారి ఆయన కోసం అక్కడే ధర్నా చేశారు.       

ఏపీ అంశాలపై కూకట్ పల్లిలో ధర్నాలు చేస్తే ఏమి వస్తుంది ? 

అయితే వైసీపీ నేతల తీరు మాత్రం కొంత మందికి విచిత్రంగా ఉంది. ఏపీ రాజకీయాల కోసం కూకట్ పల్లిలో వైసీపీ బ్రాంచ్ ను ప్రారంభించారని సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామలతో పాటు కారుమూరి వెంకటరెడ్డి, మరికొంత మంది వైసీపీ నేతలు కూకట్ పల్లిలో నివాసం ఉంటారు. వారు ప్రతి దానికి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి ధర్నా చేయడం  సమయం వృధా అని.. కూకట్ పల్లిలోనే వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నాలు చేసి.. సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారు. అందుకే ..  కూకట్ పల్లిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతున్నారు. షార్ట్ కట్ రాజకీయాలు అంటే ఇవేనని..  వారి తీరు నచ్చని వారు సెటైర్లు వేస్తున్నారు.       

టాప్ హెడ్ లైన్స్

Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
KTR Vs Revanth Reddy Debate 2026: డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
డేట్, టైం, ప్లేస్ పాలిటిక్స్ - కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్.. ఈ సవాళ్లు నిజంగానే చర్చ వరకు వెళ్తాయా?
Telangana Sentiment Politics: రాజకీయాలకు దొరికిన ఇడుపు కాయితం - తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?
రాజకీయాలకు దొరికిన ఇడుపు కాయితం - తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?
YS Jagan Mavigan Capital Plan Analysis: పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?
పొలిటికల్ ఎజెండా షిఫ్ట్ - మూడు రాజధానుల నుండి మావిగన్ కారిడార్‌కు జగన్ షిఫ్ట్.. ప్రజలు నమ్ముతారా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Meher Ramesh Daughter Wedding: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Embed widget