అన్వేషించండి

Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!

ABP Southern Rising Summit 2026: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్‌ను ఆవిష్కరించారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన భవిష్యత్ ప్రణాళికల్ని వివరించారు.

 CM Revanth Reddy Speech ABP Southern Rising Summit 2026:  హైదరాబాద్ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2026’లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అందే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు.

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం , మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే, పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కళాశాలలు దూరంగా ఉండటం వంటి కారణాలతో డ్రాప్‌అవుట్స్ ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ సమస్యను అధిగమించి ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రతిష్టాత్మకంగా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, దీనికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

సాంకేతిక విద్యలోనూ సమూల మార్పులు తీసుకొస్తున్నామని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటివరకు ఐటీఐలలో పాతకాలం నాటి చదువులే కొనసాగుతున్నాయని, అందుకే వాటిని ఆధునిక  అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు)**  మారుస్తున్నామని తెలిపారు. ఈ ఐటీసీల ఆధునీకరణ కోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో టాటా సంస్థ ఏకంగా 86 శాతం నిధులను భరిస్తోందని వెల్లడించారు.

తెలంగాణ విద్యార్థులు కేవలం వివిధ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేయడానికే పరిమితం కాకుండా, వారే సొంతంగా కొత్త సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలని తాము కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను స్థానికంగానే అందించే లక్ష్యంతో, ప్రపంచ ప్రఖ్యాత  ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్  వంటి విద్యా సంస్థలు కూడా త్వరలోనే తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయబోతున్నాయని ఆయన ప్రకటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం.. జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం రేవంత్ రెడ్డి, అతిదేబ్ సర్కార్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Embed widget