అన్వేషించండి

KTR Speech ABP Southern Rising Summit 2026 : రేవంత్ రెడ్డి వన్ టైమ్ వండర్ లీడర్.. తెలంగాణ కా బాద్షా కేసీఆర్ మాత్రమే! ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR at ABP Summit: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఢిల్లీకి సంచులు, 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ వ్యాఖ్యల పూర్తి వివరాలు!

KTR Full Speech ABP Southern Rising Summit 2026 Hyderabad:    హైదరాబాద్ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘సదరన్ రైజింగ్ సమ్మిట్–2026’ వేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కేటీఆర్.. ఢిల్లీకి ట్రిప్పులు వేయడంలో, ఢిల్లీ పెద్దలకు బ్యాగులు మోయడంలో, తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రికి 10కి 10 మార్కులు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కానీ, ఎల్‌నినో ప్రభావంపై కానీ ముఖ్యమంత్రికి ఏమాత్రం దిగులు లేదని, ప్రస్తుతం ఆయనకున్న ఒకే ఒక్క దిగులు 'నేను గడ్డం ఎందుకు పెంచుకున్నాను' అన్నదేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించిన కేటీఆర్.. ముఖ్యమంత్రి పదే పదే 'తెలంగాణ రైజింగ్' అని చెబుతున్నారని, అసలు తెలంగాణ దేనిలో రైజింగ్ అవుతోంది.. క్రైమ్‌లోనా అని సూటిగా ప్రశ్నించారు. గత మూడేళ్లలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేసిన ఒక్క అభివృద్ధి పనిని అయినా చెప్పగలరా అని సవాల్ విసిరిన ఆయన, రాష్ట్రంలో ఎవరి వద్దకైనా వెళ్లి రేవంత్ రెడ్డి పేరు చెబితే తిట్లు మాత్రమే వినిపిస్తాయని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలే ముఖ్యమంత్రి అక్రమాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తుచేశారు.

అవినీతి ఆరోపణలు చేస్తూ.. దేశంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' కాదు, 'రేవంత్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ ఇండియా' ఉందని అనాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి బిల్డర్ దగ్గర ముఖ్యమంత్రి 10 శాతం వాటా తీసుకుంటున్నారని, అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీకి 'ఏటీఎం'గా మారిన రేవంత్ రెడ్డి.. ఢిల్లీకి సంచులు పంపుతున్నారని, ఆ ఏటీఎం 2028 డిసెంబర్‌లో ఎక్స్‌పైర్ అవుతుందని పేర్కొన్నారు. రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుంటే, ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలను దొంగతనం చేసిన అసలైన 'ఓట్ చోర్' రేవంత్ రెడ్డి అని, ఆయన ఓట్లను కూడా దొంగతనం చేయగలరని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అయినప్పటికీ, అంతకుమించి ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు బాడీగార్డుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.   

ఇదే సమయంలో బీజేపీ నేతలపైనా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ల నుంచి వసూళ్ల వ్యవహారం అంతా తెలిసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రేవంత్ రెడ్డిని పట్టుకోరని, వారిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ మాత్రమే కలుపుకుంటూ వస్తోందని అన్నారు. ఇక రాష్ట్ర బీజేపీ నేతలు వాళ్ల హైకమాండ్‌కు గులాంగిరీ చేస్తారని, బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోస్తారని, రామచందర్ రావు అమిత్ షా కాళ్లు మొక్కుతారని, ఇదేం పద్ధతో తనకు ఎప్పటికీ అర్థం కాలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థాయిని ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డికి తాము చాలని, కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదని, కేసీఆర్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరని, ఒక కొడుకుగా కాకుండా ఒక సామాన్యుడిగా చెబుతున్నానని, కేసీఆర్ ఒక 'లివింగ్ లెజెండ్' అని కొనియాడారు. రేవంత్ రెడ్డి కేవలం 'వన్ టైమ్ వండర్ లీడర్' మాత్రమేనని, మూడేళ్లలో ఏం చేశారో చెప్పకుండా కేసులు పెడుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్..  "అమిత్ షా హో.. కోయి ఔర్ షా హో.. తెలంగాణ కా బాద్షా హై కేసీఆర్" అని  కేటీఆర్ స్పష్టం చేశారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Education Reforms: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ క్యాంపస్‌లు- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ విజన్!
CM Revanth Reddy: నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
నరేంద్ర మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్, దేశాన్ని అప్పుల్లోకి నెట్టాడు: ABP సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit 2026 LIVE: ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ పాక్ వెళ్లి బిర్యానీ తినొచ్చారు: ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget