Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
గాయం నుంచి కోలుకొని చాలా గ్యాప్ తర్వాత టీమ్ లోకి అడుగుపెట్టిన అల్ రౌండర్ హార్దిక్ పాండ్య ( Hardik Pandya ) వరుసగా రికార్డులను తన పేరుమీద నమోదు చేసుకుంటున్నాడు. మొన్న జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో వరుసగా సిక్సర్లు బాది టీమ్ ను గెలిపించిన హార్దిక్ పాండ్య... రెండవ టీ20లో అంతగా ప్రభావం చూపలేక పొయ్యాడు. కానీ మూడవ టీ20లో మాత్రం చెలరేగిపొయ్యాడు.
ట్రిస్టన్ స్టబ్స్(Tristan Stubbs)ను ఔట్ చేయడంతో ఇంటర్నేషనల్ టీ20లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు సాధించిన మొదటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్, 100 వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు.
మూడు నెలల బ్రేక్ తర్వాత టీమిండియా తరపున ఆడుతూ సఫారీలపై చెలరేగినపోతున్నాడు అల్ రౌండర్ హార్దిక్ పాండ్య . అయితే హార్దిక్ పాండ్య కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh), జసప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ ఘనత సాధించారు.





















