Ravi Teja New Movie: సైన్స్ ఫిక్షన్ జానర్ ట్రై చేయనున్న రవితేజ... చిరంజీవి దర్శకుడితో కొత్త సినిమా
Ravi Teja teams up with Mallidi Vassishta: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న మాస్ మహారాజా రవితేజ మరొక కొత్త సినిమాను ఓకే చేశారు. అది సైన్స్ ఫిక్షన్ జానర్ ఫిలిం.

జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలు చేస్తున్న సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja). ఖాళీగా ఉండడం అనేది ఆయన డిక్షనరీలో లేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలైనా రిలీజ్ చేయడం ఆయన స్టైల్. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరొక సినిమా ఓకే చేసినట్లు తెలిసింది. అది సైన్స్ ఫిక్షన్ జానర్ ఫిలిం. ఆ సినిమా వివరాల్లోకి వెళితే....
వశిష్ట దర్శకత్వంలో రవితేజ!
Ravi Teja - Vassishta Movie Update: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'బింబిసార'తో దర్శకుడిగా పరిచయం అయ్యారు మల్లిడి వశిష్ట. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా సోషియో ఫాంటసీ ఫిలిం 'విశ్వంభర' తీశారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. చిత్రీకరణ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేస్తున్నారు. ఈలోపు కొత్త సినిమాను ఖరారు చేసుకున్నారు వశిష్ట.
రవితేజ కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ హీరోని కలిసిన దర్శకుడు కథ వివరించడంతో పాటు సినిమాను ఓకే చేయించుకున్నారని తెలిసింది. వశిష్ట చెప్పిన సైన్స్ ఫిక్షన్ జానర్ స్టోరీ రవితేజకు బాగా నచ్చిందట. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలో అయ్యాక సైట్స్ మీదకు వెళదామని హామీ ఇచ్చారట.
సంక్రాంతికి కిషోర్ తిరుమల...
వేసవికి శివ నిర్వాణ సినిమా!
Ravi Teja Upcoming Movies: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో సంక్రాంతి బరిలో రవితేజ దిగుతున్నారు. ఆ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఆ తరువాత 'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో మరొక సినిమా ఓకే చేశారు. వచ్చే ఏడాది (2026) వేసవిలో ఆ సినిమా విడుదల కానుంది. ఆ తరువాత వశిష్ట సినిమాను స్టార్ట్ చేయాలని రవితేజ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇప్పటి వరకు అయితే అటు హీరో గాని, ఇటు డైరెక్టర్ గాని సినిమాను కన్ఫర్మ్ చేయలేదు.





















