Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Upcoming Telugu Pan India Movies 2027: కొత్త ఏడాది 2026లో రాబోయే సినిమాల కోసం కొందరు ఎదురు చూస్తున్నారు. అయితే... 2027లో సినిమాలు కొన్నిటి కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అవేమిటో తెలుసా?

కొత్త ఏడాది 2026లో రాబోయే పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే... 2027లో వచ్చే కొన్ని సినిమాల కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అవేమిటో తెలుసా? ఆ సినిమాల్లో సౌత్ స్టార్స్ నటిస్తున్నవి కొన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అవి ఏమిటో చూడండి. సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి', ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా వరకు... 2027లో విడుదల కానున్న సినిమాల పూర్తి జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణం పార్ట్ 2 రిలీజ్ 2027లోనే
రణబీర్ కపూర్ నటించిన 'రామాయణం' సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులతో పాటు భక్తులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం దీపావళి 2026కి విడుదల కానుంది. దీని రెండవ భాగం 2027లో వస్తుంది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సునీల్ దేవ్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో రావణుడు యశ్ కావడంతో కన్నడ & సౌత్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మహేష్ - రాజమౌళీల 'వారాణసి' కూడా!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారాణసి' కూడా ఎంతో మందిలో ఆసక్తి కలిగిస్తున్న సినిమా. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మందాకినిగా ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించనున్నారు. ఇటీవల ఈ సినిమా స్టార్స్ ఫస్ట్ లుక్స్, టీజర్ విడుదల చేశారు. అందులో నందిపై రుద్రుడిగా మహేష్ బాబు కనిపించారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
Also Read: Mohan Lal: మూడు సినిమాలు... 238 కోట్ల బడ్జెట్, మరి కలెక్షన్స్? ఈ ఏడాది మోహన్ లాల్ లాభం ఎంత?
View this post on Instagram
అల్లు అర్జున్ AA22 సినిమా కూడా 2027లోనే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న AA22 కూడా 2027లో విడుదల కానుందని టాక్. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చింది. దానిని చూసిన తర్వాత అభిమానులలో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
View this post on Instagram
అందరి చూపూ ప్రభాస్ 'స్పిరిట్'పై
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి అర్జున్ రెడ్డి, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం అయ్యింది. మొదట ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోన్ నటించాల్సి ఉండగా... ఆమె సినిమా నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం తృప్తి డిమ్రి నటిస్తున్నారు.
View this post on Instagram





















