Mohan Lal: మూడు సినిమాలు... 238 కోట్ల బడ్జెట్, మరి కలెక్షన్స్? ఈ ఏడాది మోహన్ లాల్ లాభం ఎంత?
Mohan Lal 2025 Movies Result: ఈ ఏడాది (2025లో) మోహన్ లాల్ మూడు సినిమాలు చేశారు. ఆ సినిమాలకు ఎంత ఖర్చు అయ్యింది? అవి ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయి? అనేది తెలుసుకోండి.

సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) సినిమాలు చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 2025లో ఆయన నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి. అవి 'ఎల్2: ఎంపురాన్', 'తుడారం' & 'హృదయపూర్వం'. ఈ మూడు చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఏడాది (2025లో) నిర్మాతలకు ఆయన ఎంత లాభం తెచ్చిపెట్టారో తెలుసుకుందాం.
బాక్సాఫీస్ ట్రేడ్ పోర్టల్ కొయిమొయి నివేదిక ప్రకారం... మోహన్ లాల్ మూడు సినిమాల బడ్జెట్ రూ. 238 కోట్లు. ఈ సినిమాల ద్వారా మొత్తం 268.89 కోట్ల రూపాయలను ఆయన సంపాదించారు. దీనితో ఆయనకు 30 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇది పెట్టుబడిపై సుమారు 12.9% రాబడి. 'ఎల్2: ఎంపురాన్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినప్పటికీ... సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటంతో రికవరీ చేయలేకపోయిందని టాక్. ఈ మూడు సినిమాల కలెక్షన్ల లెక్కల ప్రకారం... 2025లో మోహన్ లాల్ సక్సెస్ రేషియో 66.6 శాతం ఉంది.
హృదయపూర్వం లాభం @ 10 కోట్లు
'హృదయపూర్వం' చిత్రానికి IMDBలో 6.7 రేటింగ్ లభించింది. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 40.12 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ కలెక్షన్ 47.34 కోట్లు. ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా లాభం 10.12 కోట్లు. పెట్టుబడిపై రాబడి 33.73 శాతం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 76.59 కోట్ల వసూళ్లు సాధించింది.
View this post on Instagram
ఎల్2: ఎంపురాన్ @ 59 శాతం రికవరీ
'ఎల్2: ఎంపురాన్' చిత్రానికి IMDBలో 6.2 రేటింగ్ లభించింది. ఈ సినిమాను కూడా మీరు జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం 106.77 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ కలెక్షన్ 125.83 కోట్లు. సినిమా బడ్జెట్‌లో 59 శాతం రికవరీ అయ్యింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 268.23 కోట్ల వసూళ్లు సాధించింది.
View this post on Instagram
తుడారం @ 237 కోట్లు!
'తుడారం'చిత్రానికి IMDBలో 8.5 శాతం రేటింగ్ లభించింది. ఈ సినిమా జియో స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా 28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 122 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ కలెక్షన్ 143.96 కోట్లు. ఈ సినిమా 93.56 కోట్ల లాభం సంపాదించింది. అంతే కాకుండా.... 334.14 శాతం పెట్టుబడిపై రాబడి లభించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 237.76 కోట్ల వసూళ్లు సాధించింది.





















