అన్వేషించండి

Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

Bengaluru: ఓ మహిళ పోలీస్ ఆఫీసర్ ను ప్రేమించింది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ప్రేమించలేదు. కానీ ఆమె ప్రేమించాల్సిందేనని వెంట పడింది.

Bengaluru woman became a one-sided love psycho : ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు పదేపదే ప్రేమ ప్రతిపాదనలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన మహిళపై ఆయనే ఫిర్యాదు చేయడం బెంగళూరు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్ జి.జె. ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.                          

సంజనా అలియాస్ వనజా అనే మహిళ 2025 అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఇన్‌స్పెక్టర్ అధికారిక ఫోన్ నంబర్‌కు వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం సంప్రదించింది. తాను గాఢంగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్‌స్పెక్టర్ స్పందించకపోవడంతో మహిళ తనను కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పుకుని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి జి. పరమేశ్వర, మంత్రులు లక్ష్మీ హెబ్బాళ్కర్, మోతమ్మలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని  బెదిరించే ప్రయత్నంచేసింది. వారితో దిగిన ఫోటోలు కూడా పంపింది.

ఆమె ఏం చెప్పిందో కానీ హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. సంజనా అనే మహిళ ఫిర్యాదు ఎందుకు తీసుకోవడం లేదని వారి కార్యాలయాల నుంచి వివరణ అడిగారు. అయితే ఆమె ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 11న మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇన్‌స్పెక్టర్‌కు ఒక ప్యాకెట్ ఇచ్చింది. అందులో  నిద్ర మాత్రలు, రెండు లేఖలు ఉన్నాయి. ఒక లేఖలో తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుని, దానికి కారణం ఇన్‌స్పెక్టర్ అని రాస్తానని  బెదిరించింది. మరో లేఖ తన రక్తంతో రాశానని పేర్కొంది.           

ఈ ఘటన తర్వాత ఇన్‌స్పెక్టర్ ముందస్తు ఫిర్యాదు చేసి, అధికారుల ద్వారా మహిళను హెచ్చరించేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఆమె సహకరించలేదు. దర్యాప్తులో గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతో ఇతర పోలీసు అధికారులను వేధించినట్టు తేలింది. డిసెంబర్ 12న మళ్లీ స్టేషన్‌కు వచ్చి గొడవ సృష్టించి, బెదిరింపులు జారీ చేసింది. దీంతో ఇన్‌స్పెక్టర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. రామమూర్తి నగర పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. పబ్లిక్ సర్వెంట్‌ను డ్యూటీ నిర్వహించకుండా అడ్డుకోవడం, క్రిమినల్ బెదిరింపు వంటి ఆరోపణలు ఉన్నాయి.                                          

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget