Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Revanth Reddy: రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం అని..తాను గెస్టుగా మాత్రమే వెళ్లానన్నారు.

Revanth Reddy made key comments: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. KCR ఫ్యామిలీపై నేరుగా విమర్శలు చేశారు. మెస్సీ ఈవెంట్, ఫార్ములా E దర్యాప్తు, అరవింద్ కుమార్ చర్యలు, GHMC డెలిమిటేషన్ వంటి కీలక అంశాలపై స్పందించారు.
ఇటీవల జరిగిన లయోనల్ మెస్సీ సంబంధిత ఫుట్‌బాల్ ఈవెంట్‌లో తన పాల్గొనడంపై విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేవంత్ స్పష్టత ఇచ్చారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రాం. తాను కేవలం గెస్ట్‌గా మాత్రమే హాజరయ్యాననని తెలిపారు. సింగరేణి మేనేజ్‌మెంట్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చి, తమ CSR ఫండ్ నుంచి రూ.10 కోట్లు కంట్రిబ్యూట్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. మెస్సీ ఫుట్ బాల్ ఈవెంటే్ కు తన మనవడ్ని తీసుకుని వెళ్లడంపై రేవంత్ స్పందించారు. తన మనవడిని పిల్లల్లో స్పోర్టింగ్ స్పిరిట్ పెంచడానికి ఫుట్‌బాల్‌కు తీసుకెళ్లాను. మేము KCR ఫ్యామిలీ లాగా పబ్బులు తిరగడం లేదని సెటైర్ వేశారు.
మునుపటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా E రేసు అంశంపై జరుగుతున్న దర్యాప్తుపై రేవంత్ స్పందించారు. ఫార్ములా E ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతోంది అని పేర్కొన్నారు. మాజీ GHMC కమిషనర్ అరవింద్ కుమార్‌పై చర్యల కోసం DoPT నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. వచ్చిన తర్వాతే అరవింద్ కుమార్‌పై చర్యలు మొదలవుతాయని రేవంత్ స్పష్టం చేశారు.
ఇటీవల ప్రకటించిన GHMC డెలిమిటేషన్ నిర్ణయంపై రేవంత్ వివరణ ఇచ్చారు. GHMC డెలిమిటేషన్ అడ్మినిస్ట్రేషన్‌ను సింప్లిఫై చేయడానికి, వివిధ బాడీలను మర్జ్ చేయడానికి చేశాం. ఇకపై డెవలప్‌మెంట్ సిస్టమాటిక్‌గా, ప్లాన్డ్ మేనర్‌లో జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి కీలకమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.





















