అన్వేషించండి

Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?

Telangana: కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని ప్రకటించారు. ఒక్క దానం నాగేందర్ మాత్రమే ఇక సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Telangana Defection MLAs: కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానం చెప్పడానికి ఆలస్యం చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని ప్రకటించారు.             

పార్టీ మారలేదని స్పీకర్ కు కడియం శ్రీహరి సమాధానం              

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లిఖితపూర్వక సమాధానం సమర్పించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌కు స్పందిస్తూ ఆయన  ఈ లేఖ రాశారు.   బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఎక్కడా అలా వ్యవహరించలేదు అని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ ఆరోపణలు మీడియా రిపోర్టుల ఆధారంగానే ఉన్నాయని, వాటికి ఎలాంటి నిజాయితీ లేదని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ తన నుంచి నెలవారీ రూ.5,000 లెజిస్లేటివ్ పార్టీ ఖర్చుల కంట్రిబ్యూషన్‌ను ఇప్పటికీ స్వీకరిస్తోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇది తాను ఇంకా పార్టీ సభ్యుడిగానే ఉన్నాననడానికి స్పష్టమైన ఆధారమని వాదించారు. బీఆర్ఎస్ నాయకత్వం తనకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, డిసిప్లినరీ చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.             

నలుగురిపై  ఏక్షణమైనా నిర్ణయం తీసుకోనున్న స్పీకర్          
 
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్ పై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్టు నిరూపితమైన ఆధారాలు లేవని తేల్చారు. మిగతా ఎమ్మెల్యేలు  కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ తో పాటు కడియంపై  తీర్పు వెలువరించాల్సి ఉంది. కడియం కేసులో విచారణ ఇంకా జరగాల్సి ఉంది.         

దానం నాగేందర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?                
  
దానం నాగేందర్ కేసు ప్రత్యేకమైనది. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు, ఇది స్పష్టమైన ఫిరాయింపు ఆధారం.  ఇతరుల్లాగానే  ఆధారాలు సరిపోలేవు అని కొట్టివేయడానికి అవకాశం తక్కువ. అందుకే దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు.  కానీ అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు . అనర్హతా వేటు వేయాల్సి వస్తే రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం జరగనుంది.                                                  

 

 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
El Nino Effect: వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
వచ్చే జులై వరకు వర్షాలు కష్టమే.. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోక తప్పదు
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget