అన్వేషించండి

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడం దారుణం అని, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా భారత్‌లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, కాశ్మీర్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ వివాదంపై ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘ఇరాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయతుల్లా ఖమేనీ హత్య చట్టవిరుద్ధం, అనైతికం. ఆయన షియా సమాజానికి ఇష్టమైన నాయకుడు. వెంటనే ఈ దేశాల మధ్య యుద్ధం ముగియాలి. ఇందులో భారతదేశం తన పాత్రను పోషించాలని కోరుకుంటున్నాను. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఖండిస్తుందని ఆశిస్తున్నాం. గల్ఫ్ దేశాలలో 1 కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఒకవేళ యుద్ధం ఆగకపోతే, ఆ ప్రాంతంలో అశాంతి నెలకొంటుంది. భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని’ అని అన్నారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నిరసనలు..
 అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా చేపట్టిన డ్రోన్ దాడులు, వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ శనివారం (ఫిబ్రవరి 28న) రాత్రి మృతి చెందారు. ఈ వార్త భారత్ సహా పలు దేశాల్లో ప్రభావం చూపింది. తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర సహా పలు ముస్లిం ప్రభావిత రాష్ట్రాల్లో ఖమేనీ హత్యను వ్యతిరేకిస్తూ నిరసన కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలోనూ నిరసన జ్వాలలు మిన్నంటాయి.

ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమెనీ మృతికి నిరసనగా, పురాణి హవెలి ప్రాంతంలో తంజీమ్ ఈ జాఫెరీ సంస్థ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, స్థానికులు పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారులు ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ మూర్దాబాద్, నెతన్యాహు మూర్దాబాద్ అంటూ ఓల్డ్ సిటీ వీధుల్లో నినాదాలు ప్రతిధ్వనించాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా షియా ముస్లింలు అధికంగా ఉండే చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్‌లోని లాల్ చౌక్, సైదా కడల్ ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తూ "ఇజ్రాయిల్ మూర్దాబాద్", అమెరికా మూర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

కార్గిల్: లడఖ్‌లోని కార్గిల్ ప్రాంతంలో కూడా ఖమేనీకి మద్దతుగా భారీ ర్యాలీలు జరిగాయి. నిరసనకారులు ఇరాన్, భారత జాతీయ జెండాలను పట్టుకుని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ నిరసనల కారణంగా పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 60 దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Embed widget