MS Dhoni : ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల జట్టు స్కోరుపై ఎలాంటి ప్రభావం లేదు- ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఇంపాక్ట్ ప్లేయర్ నియమంపై తన అభిప్రాయాన్ని ధోని వెల్లడించాడు. అది అవసరం లేదని భావించానని తెలిపాడు. అయితే జట్టు భారీ స్కోర్లకు ఈ రూల్ మాత్రం కాదని చెప్పుకొచ్చాడు.

MS Dhoni On Impact Player Rule in IPL 2025: ఐపీఎల్‌లో 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్ నియమావళిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ రూల్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వివాదాస్పదంగా మారుతోంది. ఇది మ్యాచ్‌లో మజాను తీసుకొస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటే... ఇది ఆల్‌రౌండర్లకు నష్టం కలిగిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు.
ధోనీ అభిప్రాయం ప్రకారం, ఐపీఎల్‌లో భారీ స్కోర్లకు ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగా కాదు, ఇదంతా ఆటగాళ్ల మానసిక మార్పే కారణమని అని ధోనీ అన్నాడు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తమకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని తేల్చి చెప్పాడు. తాను ఇంపాక్ట్ ప్లేయర్ అనే భావన కూడా లేదని వివరించారు.
జియో-హాట్‌స్టార్‌లో 'ది ఎంఎస్డీ ఎక్స్‌పీరియన్స్'లో మాట్లాడిన ఎంఎస్ ధోని, "ఇంపాక్ట్ ప్లేయర్ నియమం అమలులోకి వచ్చినప్పుడు, ఆ సమయంలో దాని అవసరం లేదని నేను భావించాను. ఈ నియమం కొన్నిసార్లు మాత్రమే హెల్ప్ అవుతుంది. కానీ ఎక్కువగా అలా జరగదు. నేను ఇప్పటికీ వికెట్ కీపింగ్ చేస్తున్నాను కాబట్టి, నేను ఇంపాక్ట్ ప్లేయర్ కాదు. నేను ఫీల్డింగ్‌లో కూడా ఉండాలి" అని అన్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ వల్లే ఐపీఎల్‌లో పెద్ద స్కోర్లు రావడం లేదు
ఐపీఎల్‌లో ఇప్పుడు పెద్ద స్కోర్లు రావడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రమే కారణం దాని ఎంఎస్ ధోని అభిప్రాయపడ్డాడు. ఆయన ఏమన్నారంటే... 'చాలామంది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఐపీఎల్‌లో పెద్ద స్కోర్లు వస్తున్నాయని భావిస్తున్నారు. కానీ నా అభిప్రాయం ప్రకారం, ఆటగాళ్ల మానసిక స్థితి, పరిస్థితుల కారణంగా ఇలా జరుగుతోంది. ఒక అదనపు బ్యాట్స్‌మన్ అంత రన్స్ చేయడు, అదనపు బ్యాట్స్‌మన్ ఉన్నందున జట్లకు కాస్త వెసులుబాటు ఉంటుంది. బ్యాట్స్‌మన్లు ఎక్కువగా ఆడుతున్నారు. వారి ఉండటం వల్ల జట్టు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ' అని అన్నారు.
ముంబై ఇండియన్స్‌తో ఉన్న పోటీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన, 'బ్యాట్స్‌మన్‌గా నేను అన్ని జట్లపై రన్స్ చేయాలనుకుంటున్నాను. జట్టుకు నా అవసరం ఎలా ఉందో దాని ప్రకారం నేను బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను’అని అన్నారు.
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఏమిటి?
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రకారం, కెప్టెన్ ప్లేయింగ్ 11తో పాటు 5 సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను ఎంచుకుంటాడు. మ్యాచ్ సమయంలో, కెప్టెన్ ప్లేయింగ్ 11 నుంచి ఒక ఆటగాడిని మార్చడానికి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లలో ఒకరిని ప్లేయింగ్ 11లో చేర్చవచ్చు. కెప్టెన్ బౌలర్‌ను తీసి బ్యాట్స్‌మన్‌ను, బ్యాట్స్‌మన్‌ను తీసి బౌలర్‌ను కూడా తీసుకురావచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

