MS Dhoni Comments: రుతురాజ్ కి కెప్టెన్సీ ఎందుకిచ్చామంటే..? చేపాక్ తర్వాత ఆ స్టేడియం అంటే చాలా ఇష్టం.. ధోనీ వ్యాఖ్య
IPL 2025 Updates: చెన్నైలోని చేపాక్ స్టేడియం తర్వాత ముంబై అంటే ఎంతో ఇష్టమని ధోనీ పేర్కొన్నాడు. అక్కడ కొన్ని మధుర స్మృతులు ఉన్నాయని తెలిపాడు. ఇక రుతురాజ్ కెప్టెన్సీ కూడా వ్యాఖ్యానించాడు.

IPL 2025 CSK Former Captain MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తాజాగా జియో హాట్ స్టార్ తో చిట్ చాట్ చేసి, తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు. తనకు చెన్నై అంటే ఎంతో అభిమానమని, ఇక్కడి అభిమానులు ఎంతో చీర్ చేస్తారని తెలిపాడు. చెన్నైలో ఆడుతుంటే ఒక రకమైన గమ్మత్తు ఫీలింగ్ వస్తుందని పేర్కొన్నాడు. చెన్నై తర్వాత తనకు ముంబై స్టేడియం అంటే చాలా ఇష్టమని, 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత తమకు అక్కడ సాదర స్వాగతం లభించిందని, అలాగే 2011 వన్డే ప్రపంచప్ ఫైనల్ ను ఆక్కడే ఆడి కప్పును సాధించామని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీపై రైవల్రీ అంటూ ఏమీ లేదని, ఏ రోజు కారోజు మ్యాచ్ ను విశ్లేషించుకుంటూ ముందుకు వెళతానని చెప్పుకొచ్చాడు. ఇక పరిస్థితులన బట్టి, తన బ్యాటింగ అప్రోచ్ ఉంటుందని, మ్యాచ్ లో జట్టు పరిస్థతి, మిగిలి ఉన్న బంతుల గురించి ఆలోచించి ముందడుగు వేస్తానని పేర్కొన్నాడు. ఒకవేళ స్లాగ్ ఓవర్లో బ్యాటింగ్ కు దిగితే వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలని చూస్తానని, అదే ముందుగానే బ్యాటింగ్ కు వస్తే సమయం తీసుకుని ఆడతానని చెప్పుకొచ్చాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై..
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను ధోనీ సమర్థించాడు. దీని వల్ల జట్టుకు అదనపు బ్యాటర్ లేదా బౌలర్ ఆడే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. వయసు రిత్యా తాను ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగొచ్చని, అయితే తనకు వికెట్ కీపింగ్ చేయడమే ఇష్టమని పేర్కొన్నాడు. చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడే అన్ని నిర్ణయాలు తీసుకుంటాడడని వ్యాఖ్యానించాడు. చాలామంది ఫీల్డులో తనే నిర్ణయాలు తీసుకుంటానని అనుకుంటారని, 99 శాతం నిర్ణయాలన్నీ తనవేనని, అవసరమైతే తోచిన సలహాలు ఇస్తుంటానని పేర్కొన్నాడు. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోయినప్పటికీ, వచ్చే సీజన్ కు తనే కెప్టెన్ గా 90 శాతం అవకాశముందని చెప్పానని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి సిద్ధం కమ్మని చెప్పాడు. ఈ ఏడాది ట్రైనింగ్ సెషన్లలో కూడా ఈ విషయంపై సలహాలు ఇచ్చానని చెప్పాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీపై నిర్ణయం తీసుకున్నామని, తమ కోర్ టీమ్ లో రుతురాజ్ కీలకంగా మారాడని, తను బ్యాటర్ కాబట్టే కెప్టెన్ గా ఎంపిక చేశామని తెలిపాడు. పేసర్లైతే గాయాలతో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం లేదని, అందుకే తనను ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు.
కోహ్లీలో పరుగుల దాహం ఎక్కువ..
కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందని ధోనీ తెలిపాడు. గతంలో తను విఫలమైనప్పుడల్లా, మరంతగా బ్యాటింగ్ ని మెరుగుపర్చుకుని రీ ఎంట్రీ ఇచ్చాడని తెలిపాడు. మ్యాచ్ కు సంబంధించి తనతో చర్చలు జరిపేవాడని, ఇప్పుడు ఇరువురం కెప్టెన్లం కాదు కాబట్టి, ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే మరిన్ని చర్చలు జరుగుతాయిన చెప్పుకొచ్చాడు. ఇక జియో హాట్ స్టార్ లో తను రీజనల్ వ్యాఖ్యానాన్ని వింటానని చెప్పుకొచ్చాడు. తనకు భోజ్ పురి కామెంట్రీ అంటే ఇష్టమని, అందులో ఒక వైబ్ ఉంటుందని తెలిపాడు. అలాగే హర్యాన్వీ డయలెక్ట్ అంటే ఇంకా ఇష్టమని పేర్కొన్నాడు. కామెంట్రీ విన్నప్పుడు విశ్లేషకుల సూచనలు చాలా బాగా ఉపకరించే అవకాశముంటుందని తెలిపాడు. కొన్నిసార్లు అది మన అప్రోచ్ ను కూడా మార్చే అవకాశముంటుందని తెలిపాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

