India Playing XI: జట్టులో రెండు మార్పులు.. షమీ తిరిగొస్తాడా..? అభిషేక్ ఆడకపోతే ఆ ప్లేయర్ బరిలోకి..
భారత జట్టులో కూడా ఒకటి కాదు రెండు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అభిషేక్ శర్మ మడమ గాయంతో బాధపడతుతున్నాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ లో తను గాయపడ్డాడు.మ్యాచ్ కు అందుబాటులో ఉండేదానిపై స్పష్టత లేదు.

Ind Vs Eng 2nd T20 Updates: ఇంగ్లాండ్ తో మరోసారి పోరుకు శనివారం భారత్ సిద్ధమవుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే రెండో టీ20లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ఫైనల్ లెవన్ ను ప్రకటించింది. జట్టులో ఒక్క మార్పు చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ ప్లేసులో బ్రైడెన్ కార్స్ ను జట్టులోకి తీసుకుంది. తొలి టీ20లో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అట్కిన్సన్ పై వేటు పడింది. మరోవైపు చెన్నైలో ఆడబోయే భారత జట్టులో కూడా ఒకటి కాదు రెండు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ మడమ గాయంతో బాధపడతుతున్నట్లు తెలుస్తోంది. క్యాచింగ్ ప్రాక్టీస్ లో భాగంగా తను గాయపడ్డాడు. అతను మ్యాచ్ కు అందుబాటులో ఉండేది, లేనిది ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ అతను ఆడితే సరే, లేకపోతే తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మను ఓపెనింగ్ లోకి పంపించే అవకాశముంది. ఇక అభిషేక్ ప్లేసులో వాషింగ్టన్ సుందర్ లేదా ధ్రువ్ జురెల్ ను జట్టులోకి తీసుకుంటారు. స్పిన్ ఆల్ రౌండర్ తో పాటు చెన్నై సొంత గ్రౌండ్ కావడంతో వాషింగ్టన్ నే తీసుకునే అవకాశముంది.
షమీ తిరిగొస్తాడా..?
ఈ సిరీస్ కు భారత జట్టు ప్రకటన నుంచి అందరి కళ్లు వెటరన్ పేసర్ మహ్మద్ షమీపైనే ఉన్నాయి. తను అంతర్జాతీయ క్రికెట్లోకి ఎప్పుడు పునరాగమనం చేస్తాడోనని అందరూ వెయిట్ చేశారు. అయితే కోల్ కతాలో జరిగిన తొలి టీ20లో అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఎడమ మోకాలిలో కాస్త డిస్కంఫర్ట్ ఉండటంతోనే షమీని ఆడించలేదని తెలుస్తోంది. అయితే చెన్నై మ్యాచ్ కు అతను ఫిట్ గా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే చేపాక్ లో షమీ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రవి బిష్ణోయ్ ప్లేసులో అతడిని ఆడించే అవకాశాలు ఉన్నాయి. చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్నప్పటికీ, వరుణ్ చక్రవర్తి రూపంలో భారత్ వద్ద అసలైన అస్త్రం ఉంది. గత మ్యాచ్ లో మూడు వికెట్లతో ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యి, సత్తా చాటాడు. దీంతో షమీని పరీక్షించ దలిస్తే బిష్ణోయ్ పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్ లో తను ఒక్క వికెట కూడా తీయలేకపోయాడు.
ప్లేయింగ్ లెవన్ ఇలా ఉండబోతోంది..
ఒకవేళ గాయం ఇబ్బంది పెట్టకపోతే అభిషేక్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ తో కలిసి తను ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతారు. లోయర్ ఆర్డర్ లో మహ్మద్ షమీ లేదా రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడతారు. ఇక ఐదు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. బ్యాటర్లు రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ ను మరో 43 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. చెన్నై మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ లో తన ఆధిక్యాన్ని 2-0తో రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. కొద్దిగా స్పిన్నర్లకు అనుకూలించిన కోల్ కతాలోనే వరుణ్ ను ఎదుర్కోలేకపోయిన ఇంగ్లాండ్, స్పిన్ కు అనుకూలమైన చేపాక్ లో ఎలా ఆడతారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
భారత్ ప్లేయింగ్ లెవన్ (అంచనా):
అభిషేక్/వాషింగ్టన్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, షమీ/బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

