అన్వేషించండి

Nara Lokesh: దావోస్ నుంచి తిరిగొచ్చిన నారా లోకేష్, గన్నవరం ఎయిర్‌పోర్టులో మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం

Nara Lokesh Reaches Gannavaram Airport : ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన ముగిసింది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు స్వాగతం పలికారు.

AP Minister Nara Lokesh returns to AP after completing Davos visit | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఐదు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు ప్రముఖులతో సమాదేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 4 రోజుల పాటు దావోస్ వేదికగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేశారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లి రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ కు ఉన్న అనుకూల పరిస్థితులను, కూటమి ప్రభుత్వ సహకారంపై దిగ్గజ సంస్థల అధినేతలతో నారా లోకేష్ సమావేశమై చర్చలు జరిపారు. త్వరలోనే వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనున్నారు.

పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు అవుతూనే మరోవైపు నారా లోకేష్ 8 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరై కూటమి ప్రభుత్వ పాలసీలు, చంద్రబాబు విజన్ ను వారికి వివరించారు జూన్ నెలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకుంటున్న పారిశ్రామిక విధానాల నిర్ణయాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ (AI), క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ వ్యాపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో లోకేష్ చర్చలు జరిపారు.

దావోస్ లో జరిగిన పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ లో బ్రాండ్ ఏపీని మంత్రి నారా లోకేష్ ప్రమోట్ చేసి పెట్టుబడుల కోసం శ్రమించారు. మొత్తం 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రముఖులతో సమావేశం సందర్భంగా మంగళగిరి చేనేత కార్మికులు నేసిన శాలువాలలతో విదేశీ ప్రముఖులను సన్మానించి తన నియోజకవర్గ కళాకారులపై ప్రేమను చాటుకున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టీ షర్ట్ ధరించి అరకు కాఫీని ప్రమోట్ చేశారా? వైరల్ ఫొటోలో నిజమెంత

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌కు మోదీ, రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి
Year Ender 2025: ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ఈ ఏడాది ప్రమోషన్ పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే... పిల్లలకు ఏం పేర్లు పెట్టారంటే?
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
ITR దాఖలు చేసేటప్పుడు ఈ తప్పులు చేశారా, మీకు నోటీసులు తప్పవు !
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
స్టైలిష్ లుక్ తో వస్తున్న New Gen Seltos.. లాంచ్ డేట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
Embed widget