అన్వేషించండి

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 

Moinabad Farmhouse Case | మొయినాబాద్ పార్టీలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, స్నేహితుడు ఆహ్వానిస్తే వెళ్లి వచ్చానని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. దుష్ప్రచారం నమ్మవద్దని సూచించారు.

‎TDP MP Putta Mahesh Kumar | హైదరాబాద్/ఏలూరు: హైదరాబాద్ మొయినాబాద్ ఫాం హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై ఏలూరు ఎంపీ  పుట్టా మహేష్ కుమార్ స్పందించారు. ఈ కేసులో తనపై వచ్చిన కథనాలను టీడీపీ ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం పోలీసు విచారణ ముగించుకుని హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పుట్టా మహేష్ కుమార్ మీడియాకు వీడియో ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

‘నేను ఎలాంటి వ్యక్తినో రెండేళ్లుగా ఏలూరు ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరికీ తెలుసు. నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. ఏ తప్పు చేయలేదు. కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళాను. కలిసి తిరిగి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆ విషయాలను ఎవ్వరూ నమ్మవద్దు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను. పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని’ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలుస్తుందని, తన విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు, అభిమానులకు టీడీపీ ఎంపీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్..

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యక్తుల తప్పుల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. 

తెలంగాణ పోలీసుల ప్రకటన వెలువడిన వెంటనే, పుట్టా మహేష్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. చంద్రబాబు సూచన మేరకు పల్లా శ్రీనివాసరావు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే ఈ వ్యవహారంలో ఎంపీ ఇచ్చే సంజాయిషీని బట్టి తదుపరి కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పల్లా వెల్లడించారు. అంతవరకు ఆయన ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన పార్టీపై 'ఈగల్ ఫోర్స్' మెరుపు దాడులు చేసింది. పార్టీకి హాజరైన వారికి జరిపిన టెస్టుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. రక్త పరీక్షలో ఎంపీకి పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. దాడుల సమయంలో నిందితులు తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి పోలీసులను భయపెట్టే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనా స్థలంలో రివాల్వర్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంపై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget