Rachakonda CP on Meerpet Case | మీర్ పేట కేసు తేల్చాలంటే నిపుణులు కావాలి | ABP Desam
మీర్ పేట్ లో తన భార్యను అత్యంత కిరాతకంగా చంపిన సైకో భర్త కేసు పోలీసుకు సవాల్ గా మారింది. తన భార్యను నరికి చంపి ముక్కలు చేసి కుక్కర్ లో ఉడకబెట్టినట్లు నిందితుడు ఒప్పుకుంటున్నఅందుకు తగిన ఆధారాలు పోలీసులకు లభించటం లేదు. కుక్కర్ లో ఉడకబెట్టిన భార్య మృతదేహ భాగాలను..రోట్లో పొడిచేసి ఎముకలను జిల్లేల గూడ చెరువులో పడేశానని నిందితుడు చెబుతున్నా..అందుకు తగిన ఆధారాలు ఇంటిలో పోలీసులకు లభించటం లేదు. ఇదే అంశంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందించాడు. నిందితుడు చెబుతున్న దాని ప్రకారం ఆధారాలను దొరకబుచ్చుకునేందుకు దేశవ్యాప్తంగా టెక్నికల్ నిపుణుల సహాయం తీసుకుంటామని...ఇది అంత ఈజీగా తేలే కేసు కాదని చెబుతున్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. బ్లూరే విధానం ద్వారా నిందితుడు చేసిన క్రైమ్ కి సంబంధించిన ఆనవాళ్ల ను పసిగట్టే లా టెక్నాలజీ సహాయాన్ని కోరుతున్నట్లు సీపీ సుధీర్ బాబు మీడియా కు తెలిపారు.





















